Kanna Lakshminarayana : టీడీపీ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి జగన్ అవసరం లేదని అన్నారు. ఏపీలో స్వేచ్ఛగా బతకాలంటే రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవసరం లేదని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణకు ఏపీని తాకట్టు పెట్టారని విమర్శించారు. అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చో సీఎం నిరూపించారని ఆరోపించారు.
పదహారు నెలల పాటు జైల్లో ఉండి రాష్ట్రాన్ని ఎలా దోచుకోవచ్చు అనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి రీసెర్చి చేశారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రయాన్-3 పంపే సమాచారం కోసం అమెరికా, రష్యా ఎదురు చూపు - కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఏపీకి జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దానిని తెలియజేస్తూ వంద కారణాలతో పుస్తకం వేస్తామని చెప్పారు. పోలవరం కట్టలేదని, ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెలిపారు. ఒకసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.
Kanna Lakshminarayana : ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే బ్రిటీషర్లకు అమ్మేస్తారని అన్నారు. జగన్ సీఎం అయిన తరువాత నాసిరకం సారా అమ్ముకుంటూ తాగుబోతులను పెంచారని విమర్శించారు. దళితులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసినంత ద్రోహం ఇంకే ముఖ్యమంత్రి చేయలేదని ఆరోపించారు. విశాఖలో భూములు కొట్టేయడానికే కొత్త అసైన్మెంట్ చట్టం తీసుకొచ్చారని అన్నారు.
దీపావళి 2023 : రాజేంద్రనగర్ క్రాకర్స్ షాపు లో భారీ అగ్ని ప్రమాదం..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బానిసలుగా చేస్తున్నారని దుయ్యబట్టారు. మీడియా సమావేశం పెడితే పోలీసులను కాపలాగా పెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఏపీని సర్వనాశనం చేశారని, ఇక్కడ స్వేచ్ఛగా బ్రతకాలంటే కచ్చితంగా రాష్ట్రపతి పాలన అవసరం అని తెలిపారు.