త్వరలోనే పోలీసు శాఖలోఖాళీలు భర్తీ: సుచరిత

By narsimha lodeFirst Published Jun 25, 2019, 11:16 AM IST
Highlights

ఈ ఏడాది సైబర్ నేరాలు సంఖ్య పెరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం మేకతోటి సుచరిత ప్రకటించారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే  భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.
 


అమరావతి: ఈ ఏడాది సైబర్ నేరాలు సంఖ్య పెరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం మేకతోటి సుచరిత ప్రకటించారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే  భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. మంగళవారం నాడు అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  తొలుత ఏపీ డిప్యూటీ సీఎం మేకతోటి సుచరిత ప్రసంగించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకొన్నామన్నారు.

సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆమె చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణఖు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లను అమలు చేసిన రాష్ట్రం ఏపీ అని ఆమె గుర్తు చేశారు. 

ఆ తర్వాత ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో  మావోయిస్టుల సమస్య ఉందన్నారు. ఆంధ్రా - బోర్డర్ సరిహద్దులో మావోల సమస్య ఉందన్నారు. మావోలను ఎదుర్కోవడంలో  రాష్ట్ర పోలీసులు అత్యంత సమర్థవంతంగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల తర్వాత రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో రాజకీయ గొడవలు జరిగాయని  డీజీపీ చెప్పారు.

click me!