జగన్ దగ్గర మార్కులు లేకుంటే.. మంత్రి పదవి ఊస్టింగే: డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 1, 2021, 4:52 PM IST
Highlights

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చుంటామంటే కుదరదని... పని చేసి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ వద్ద మార్కులు సంపాదించాలని సూచించారు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చుంటామంటే కుదరదని... పని చేసి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ వద్ద మార్కులు సంపాదించాలని సూచించారు. ఏ మాత్రం తేడా వచ్చినా మంత్రి పదవి ఊడిపోతుందని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తమకు మంత్రి పదవులు ఇచ్చే సమయంలోనే జగన్ మోహన్ రెడ్డి చెప్పారని వెల్లడించారు.

Also Read:వివాదాస్పద వ్యాఖ్యలు: ముస్లింలకు క్షమాపణలు చెప్పిన ఏపీ డీప్యూటీ సీఎం నారాయణ స్వామి

రెండున్నర సంవత్సరాల తర్వాత మీ అవసరం ఉంటేనే పదవిలో ఉంటారని... లేకపోతే పదవి పోతుందని ఆనాడే హెచ్చరించారని వివరించారు.మంత్రిగా తాను మాత్రం ఎంతో నిజాయతీగా, పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేశానని నారాయణ స్వామి చెప్పారు. ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తనకు జగన్ నుంచి తనకు మంచి మార్కులు వచ్చాయని నారాయణస్వామి చెప్పారు

click me!