స్మశానయాత్ర, జనాన్ని భయపెట్టే యాత్ర : నారా లోకేశ్ పాదయాత్రపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 26, 2023, 3:31 PM IST
Highlights

లోకేష్‌ది పాదయాత్ర కాదని, స్మశానయాత్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పాదయాత్ర చేసి సమస్యలు పరిష్కరించాలి కానీ.. శిలాఫలాకాలను ధ్వంసం చేస్తున్నారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ది పాదయాత్ర కాదని, స్మశానయాత్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే యాత్రగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. పాదయాత్ర చేసి సమస్యలు పరిష్కరించాలి కానీ.. శిలాఫలాకాలను ధ్వంసం చేస్తున్నారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే.. నారా లోకేష్‌ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి . మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడంటూ చురకలంటించారు. ఫైబర్ నెట్ స్కాంలో దోపిడీకి పాల్పడ్డవాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడితే ఆ యువ నాయకుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. 

ALso REad: వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి.. కేంద్రం ఫోకస్ చేస్తే జైలుకే : నారా లోకేష్‌పై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు

వందరూపాయల చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయకుల ప్రాణాలు తీశారంటూ లక్ష్మీపార్వతి గుంటూరు తొక్కిసలాటను ప్రస్తావించారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం వుందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. కమ్యూనిస్ట్ నేతలు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు మార్గంలో వెళ్తున్నారని.. చంద్రబాబుతో కలిసి వెళ్తే ఆయనకు చివరికి మిగిలేది నష్టమేనని ఆమె వ్యాఖ్యానించారు. 

ఇదిలావుండగా.. ఇటీవల టీడీపీలో నాయకత్వ విషయంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ నాయకత్వాన్ని సమర్ధించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేరని అన్నారు. ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడని తాను భావిస్తున్నట్లు లక్ష్మీ పార్వతి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం అవుతారని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ని ఎవరూ ఎదిరించలేరని.. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలంతా జగన్ వెంట వెన్నారని లక్ష్మీపార్వతి అన్నారు. టీటీడీ నిర్వహణ బాగుందని ఆమె కితాబిచ్చారు. 

click me!