కాపులు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను నమ్మడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్పారు. కౌలు రైతుల భరోసా యాత్రలో వైసీపీపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: కాపులు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను నమ్మడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం Kottu Satyanarayana చెప్పారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించిన కౌలు రైతుల భరోసా యాత్రలోJana Sena చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికార వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.
Telanganaలో నా తెలంగాణ అనే భావన వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులమనే భావన ఎక్కువగా ఉంటుందన్నారు. కులాన్ని గౌరవిస్తూ , కులానికి అతీతంగా ఆలోచించాలని ఆయన కోరారు. అంబేద్కర్, మహాత్మా గాంధీలు YS Jagan లాగా పాదయాత్రలు చేయలేదని Pawan Kalyan చెప్పారు.
ఈ విమర్శలపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేయాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సూచించారు. టీడీపీపై పోరాటం చేయాాలని పవన్ కళ్యాణ్ కు మంత్రి కొట్టు సత్యనారాయణ సలహా ఇచ్చారు.చంద్రబాబు పంచన ఉండి జనసేన ఇంకా పలుచన అవుతుందన్నారు. జనసేనను విలీనం చేయాలని ఎవరైనా అడిగారా అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ కు రాజకీయ సిద్దాంతాలు లేవన్నారు. చంద్రబాబుకు మద్దతిచ్చి పవన్ కళ్యాణ్ చాలా నష్టపోయారని కొట్టు సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
ఆలయాలకు మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాలతో పాటు 32 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఆలయాల నుండి వచ్చే నిధులను సీజీఎప్ కింద జమ చేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. దేవాదాయశాఖ నుండి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లలేదన్నారు. దేవాదాయశాఖ నిధుల విషయమై బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే రాజకీయం చేస్తుందన్నారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్లడం మంచిది కాదన్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఘాట్ రోడ్డు దర్శనాలు నిలిపివేసే ఆలోచనలో ఉన్నామని కొట్టు సత్యనారాయణ తేల్చి చెప్పారు.