రాష్ట్ర విభజన, చంద్రబాబు తప్పులు... అందుకే ఏపీకి ఈ కష్టాలు: జలవివాదంపై ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 3, 2021, 4:27 PM IST
Highlights

రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద నష్టం జరిగిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే నేటికి ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలోని నియమ నిబంధనలకే తాము ఇప్పటికీ కట్టుబడి వున్నామని కృష్ణదాస్ తెలిపారు. 

రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద నష్టం జరిగిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే నేటికి ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలోని నియమ నిబంధనలకే తాము ఇప్పటికీ కట్టుబడి వున్నామని కృష్ణదాస్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కరించడంలో కేంద్రం చొరవ చూపించాలని ఆయన కోరారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది తెలంగాణ మంత్రులు తొందరపాటుతో మాట్లాడుతున్నారని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అన్ని ప్రాంతాల్లో జలయజ్ఞం కింద ప్రాజెక్ట్‌లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. 

Also Read:కృష్ణాజలాల ఎత్తిపోతల పథకం పనుల్లో మరో ముందడుగు.. ఆదివారం భూమిపూజ..

కాగా, ఇటీవల ఎంపికైన నూతన అంగన్‌వాడీలకు శనివారం నియామక పత్రాలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అందజేశారు. నరసన్నపేట ప్రాజెక్టు పరిధిలో 14, సారవకోట 3, కోటబొమ్మాలి ఒకరికి నియామక పత్రాలను అందజేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, జవాబుదారీతనం కనిపించాలనీ అలాంటి వారికి అండగా ఉంటామని కృష్ణదాస్ పేర్కొన్నారు.

click me!