విజయవాడ: దుర్గగుడిలో సస్పెండైన 15 మందికి తిరిగి పోస్టింగ్.. సర్వత్రా విమర్శలు

By Siva KodatiFirst Published Jul 3, 2021, 2:49 PM IST
Highlights

విజయవాడ దుర్గగుడి అక్రమాల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. గతంలో సస్పెండైన 15 మంది సిబ్బందికి పోస్టింగ్ ఇస్తూ దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. 15 మందికి అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు ఆలయాల్లో ఏడాదిపాటు డిప్యుటేషన్ చేస్తూ ప్రభుత్వం పోస్టింగ్ ఆదేశాలు జారీ చేసింది.

విజయవాడ దుర్గగుడి అక్రమాల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. గతంలో సస్పెండైన 15 మంది సిబ్బందికి పోస్టింగ్ ఇస్తూ దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. 15 మందికి అన్నవరం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు ఆలయాల్లో ఏడాదిపాటు డిప్యుటేషన్ చేస్తూ ప్రభుత్వం పోస్టింగ్ ఆదేశాలు జారీ చేసింది. 15 మంది విచారణ తర్వాత ఈవో నివేదిక ఆధారంగా పోస్టింగ్ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్కడి ఆలయాల నుంచి 13 మందికి దుర్గగుడిలో పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే సస్పెండ్ చేసిన వారికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. 

ఆలయంలోని పలు విభాగాల్లో అవకతవకలకు పాల్పడిన 15 మందిపై 2 నెలల క్రితం ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. నాడు ఏసీబీ నివేదిక ఆధారంగా 15 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన 15 మందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే శుక్రవారం దేవాదాయ శాఖ కమీషనర్‌తో ఈవో, అధికారులు సమావేశమయ్యారు. 

Also Read:దుర్గగుడి అక్రమాల్లో ట్విస్ట్: సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది తిరిగి విధుల్లోకి.. పావులు కదుపుతున్న ఈవో

కాగా, దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలను గుర్తించారు విజిలెన్స్ అధికారులు . సెక్యూరిటీ టెండర్లలాగానే, శానిటరీ టెంటర్లను నిబంధనలకు విరుద్ధంగా ఖరారు చేసినట్లుగా చెప్పారు. మూడు కంపెనీలు టెంటర్లు వేసినా, నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నికల్ సర్వీసెస్‌కు టెండర్లు ఇచ్చారని చెబుతున్నారు విజిలెన్స్ అధికారులు. కమీషనర్ అనుమతి లేకుండా ఈవో సురేశ్ బాబు అగ్రిమెంట్ చేసినట్లుగా గుర్తించారు.
 

click me!