కృష్ణాజలాల ఎత్తిపోతల పథకం పనుల్లో మరో ముందడుగు.. ఆదివారం భూమిపూజ..

By AN TeluguFirst Published Jul 3, 2021, 2:21 PM IST
Highlights

కరవు రైతు ముంగిటకు కృష్ణా జలాలు రానున్నాయి.  కృష్ణాజలాల ఎత్తిపోతల పథకం పనులు ఆదివారం మరో అడుగు ముందుకు పడనున్నాయి. కరవు ప్రాంతాలను సస్య శ్యామలం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం, కడప, రాజంపేట ఎం పి లు వైఎస్ అవినాష్ రెడ్డి, పి వి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ల ప్రయత్నాలు ఫలించాయి.  

కరవు రైతు ముంగిటకు కృష్ణా జలాలు రానున్నాయి.  కృష్ణాజలాల ఎత్తిపోతల పథకం పనులు ఆదివారం మరో అడుగు ముందుకు పడనున్నాయి. కరవు ప్రాంతాలను సస్య శ్యామలం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం, కడప, రాజంపేట ఎం పి లు వైఎస్ అవినాష్ రెడ్డి, పి వి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ల ప్రయత్నాలు ఫలించాయి.  

తొలుత  రూ 2500 కోట్ల అంచనా వ్యయంతో 1200 క్యూసెక్కుల సామర్థ్యం గల  ఈ ప్రాజెక్ట్ ప్రణాళికలుకు రూపకల్పన చేయడంతో పాటు2019 డిసెంబర్ 24 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా శంఖుస్థాపన చేయడం జరిగింది.కరవు రైతుల సౌకర్యార్థం  1200 క్యూసెక్కుల నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని అందించేవిధంగా ప్రణాళికలు రూపొందించి ప్రస్తుతం ఆ అంచనా  వ్యయాలను  రూ 5 వేల కోట్లకు పెంచి  పనులు ప్రారంభిస్తున్నారు.

గాలేరు నగరి హంద్రీనీవా  రాయచోటికి సంబందించిన కాలేటి వాగు ప్రాజెక్ట్  నిర్మాణాలకు   కడప, రాజంపేట ఎంపిలు వైఎస్ అవినాష్ రెడ్డి, పి వి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ల చేతులమీదుగా భూమి పూజా కార్యక్రామలు ఆదివారం జరగనున్నాయి.   

ఈ సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గండికోట కెనాల్ నుంచి కాలేటివాగుకు 2 వేల క్యూసెక్కుల నీరు, కాలేటి వాగు నుంచి వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్  కు 1400 క్యూసెక్కుల నీరు,వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్ నుంచి శ్రీనివాసపురం, అడవిపల్లె రిజర్వాయర్ లకు 750 క్యూసెక్కుల నీరు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలకు 450 క్యూసెక్కుల నీరు, చక్రాయపేట కు 150 కూసెక్కుల నీరు,మిగిలిన 600 క్యూసెక్కుల నీటితో  తంబల్లపల్లె, పుంగనూరు నియోజక వర్గాలలో రిజర్వాయర్ లు నిర్మించి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కు అందిస్తామని, దాదాపు ఐదారు నియోజక వర్గాలలోని రైతుల కల నెరవేరబోతోందన్నారు.

కరోనా మహమ్మారి, ఎన్నికల కోడ్ వల్ల పద్నాలుగు నెలలపాటు సమస్యల వల్ల    ఈ సాగునీటి పథకం పనులు ఇప్పుడు ప్రారంభమవుచున్నాయన్నారు. రెండుమూడేళ్ల వ్యవధిలో ఈ నిర్మాణపు పనులు పూర్తవుతాయన్నారు. గాలివీడు మండల పరిధిలోని మిట్ట గ్రామాలలోని చెరువులకు, రాయచోటి మండలంలోని పలు చేరువులకు సాగునీటిని నింపే పనులు జరుగుచున్నాయని, ఏడాదిలోగా ఆ పనులు పూర్తవుతాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పథకాల శిలాపలకాలు కార్యరూపం దాల్చుతుండడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 

కరోనా మూడవ విడత అడ్డంకి సృష్టించకుండా ఉంటే ఆ పనులన్నీ రెండేళ్లలో పూర్తవుతాయన్నారు.ఈ వారంలో రెండు చిరకాల వాంఛలు నెరవేరాయని, రూ 340 కోట్ల నిధులుతో   భూగర్భ డ్రైనేజీ, వెలిగల్లు నుంచి రాయచోటి పట్టణానికి అదనపు నీటి పథకం, పట్టణ సుందరీకరణ పనులుప్రారంభమయ్యాయని, రూ 5 వేల కోట్ల  నిధులుతో గాలేరు నగరి - హంద్రీనీవా లింక్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుచుండడం  ఆనందదాయకమన్నారు.

click me!