ఫలితాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర.. జనం జగన్‌వైపే: ఏలూరు విజయంపై ఆళ్లనాని

By Siva KodatiFirst Published Jul 25, 2021, 6:32 PM IST
Highlights

ఏలూరు ప్రజలు సీఎం జగన్‌కు అండగా నిలిచారని ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏలూరు కార్పోరేషన్‌లో ఫలితాలు అడ్డుకునేందుకు చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలు, భగవంతుడు వైసీపీకి అండగా నిలిచారని తెలిపారు. 

చంద్రబాబు కుట్రలను ఏలూరు ప్రజలు తిప్పికొట్టారని అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏలూరు ప్రజలు సీఎం జగన్‌కు అండగా నిలిచారని నాని స్పష్టం చేశారు. ఏలూరు కార్పోరేషన్‌లో ఫలితాలు అడ్డుకునేందుకు చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలు, భగవంతుడు వైసీపీకి అండగా నిలిచారని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లోనూ చంద్రబాబు శవ రాజకీయాలు చేశారని.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారని ఆళ్ల నాని దుయ్యబట్టారు. ఇకనైనా మారకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి గత ఫలితాలే వస్తాయంటూ ఆయన చురకలు వేశారు. 

Also Read:భారీ మెజారిటీతో ఏలూరు కార్పోరేషన్ వైసీపీ కైవసం: టీడీపీకి దక్కింది మూడే

కాగా, ఏలూరు  కార్పోరేషన్ ను వైసీపీ భారీ మెజారిటీతో కైవసం చేసుకొంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లను అధికార పార్టీ దక్కించుకొంది. టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపును ఆదివారం నాడు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఏలూరు కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి.

click me!