జగన్‌కు షాక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

Siva Kodati |  
Published : Jan 22, 2020, 08:56 PM ISTUpdated : Jan 22, 2020, 09:08 PM IST
జగన్‌కు షాక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లుపై శాసనమండలి ఛైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టిడిపి నాయకులు పట్టుబట్టడంతో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి ఛైర్మన్ నిర్ణయించారు.

ఆంధ్ర ప్రదేశ్ వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లుపై శాసనమండలి ఛైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టిడిపి నాయకులు పట్టుబట్టడంతో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి ఛైర్మన్ నిర్ణయించారు.

తనకున్న విచక్షణాధికారాలతో ఈ రెండు బిల్లులను ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే సభలో అధికారపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.

ఛైర్మన్ నిర్ణయం పట్ల తెలుగుదేశం ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ప్రస్తుతం అరుపులు, కేకలతో మండలి దద్దరిల్లుతోంది. 

Also Read:రంగంలోకి మంత్రులు, ఛైర్మన్‌తో మంతనాలు: మండలికి ఏజీని పిలిచిన సర్కార్

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు సెలక్ట్ కమిటీకి పంపే అంశంపై సందిగ్థత నెలకొనడంతో ప్రభుత్వం అడ్వకేట్ జనరల్‌ను శాసనమండలికి పిలిచింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లకూడదని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

ఈ మేరకు మంత్రులతో సమావేశమైన అడ్వొకేట్ జనరల్ న్యాయపరమైన అంశాలపై సలహాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మండలిలో ఛైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.

సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఛైర్మన్ అధికార, ప్రతిపక్షాలను కోరారు. బిల్లును చర్చకు తీసుకున్న సమయంలో సాంకేతిక మోషన్ మూవ్ కాలేదని ఛైర్మన్ ప్రకటించిన ఆయన మోషన్ మూవ్ అయితేనే నిర్ణయం తీసుకోగలమని తెలిపారు.

ఛైర్మన్‌తో మంత్రులు పిల్లి, బుగ్గన, బొత్స, మంతనాలు జరుపుతున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడానికి నిబంధనల ప్రకారం కుదరదని, అందుకు ఎలాంటి అవసరం లేదని బుగ్గన తేల్చి చెప్పారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు.. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు.

బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ముందే నోటీసులిచ్చామని.. నిబంధనలకు విరుద్ధంగా ఒకే రోజు బిల్లు పెట్టి చర్చ జరిపి ఓటింగ్ పెట్టుకున్నా.. వైసీపీ నుంచి మేం రూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:మూడు రాజధానులు: కోర్టుల్లోనూ తేల్చుకునేందుకు.. జగన్ ఎత్తుగడ

ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటులో నాన్ ఫైనాన్స్ బిల్లుగా పెట్టి.. ఆ తర్వాత ఫైనాన్స్ బిల్లుగా ఏ నిబంధన ప్రకారం మార్చారని యనమల ప్రశ్నించారు. మండలిలో మెజార్టీ ఉన్న మేం అడిగితే సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనని, కావాలంటే ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవచ్చునని రామకృష్ణుడు సూచించారు.

ఈ విషయంలో చైర్మన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని.. సభలో మెజార్టీ సభ్యులు ఏం కోరుకుంటే చైర్మన్ అదే చేస్తారన్నారు. ఓటింగ్ సమయంలో సభ్యులు కానివారిని బయటకు పంపాలని యనమల డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..
AP Budget 2026 : పవన్ కల్యాణ్, లోకేష్ లలో పైచేయి ఎవరిది? ఎవరికెన్ని నిధులు దక్కాయో తెలుసా..?