
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ap cs ) సమీర్ శర్మ (sameer sharma) పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరు నెలల పాటు .. అంటే నవంబర్ 30 వరకు పొడిగించింది. సీఎస్ పదవీ కాలం పెంపుపై డీవోపీటీ (dopt) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పటికే ఒకసారి సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. నిజానికి గతేడాది నవంబర్ 30తో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2022 మే 31 వరకు ఆరు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్రం.