నారాయణ బెయిల్ రద్దుకై చిత్తూరు పోలీసుల పిటిషన్: మాజీ మంత్రికి కోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published May 13, 2022, 4:35 PM IST
Highlights

మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు కోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. నారాయణ బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10న టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టైన  నారాయణకు ఈ నెల 11 కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.


చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Tenth  క్లాస్ తెలుగు ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో బెయిల్ విడుదలైన   మాజీ మంత్రి నారాయణకు ఢ Chittoor  కోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. bail రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పోలీసుల పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయమై మాజీ మంత్రి Narayanaకు కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ విషయమై ఈ నెల 24న విచారణ నిర్వహించనుంది.

టెన్త్ క్లాస్ Telugu ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను ఈ నెల 10వ తేదీన హైద్రాాద్ లో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలోని Tirupati  నారాయణ విద్యా సంస్థల నుండి తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీపై నమోదైన కేసులో నారాయణను అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 27న చిత్తూరు DEO  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. మాజీ మంత్రి నారాయణకు ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

2014లోనే Narayana Educational Institutes  చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

also read:టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ చిత్తూరు పోలీసుల పిటిషన్

మాజీ మంత్రి  నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని పోలీసులు అభియోగం మోపారు. కానీ, 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు న్యాయమూర్తికి సమర్పించారు.

 నేరారోపణ నమ్మే విధంగా లేదని Judge  అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిననాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని  న్యాయమూర్తి  ఆదేశించారు.

మరో వైపు నారాయణ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు పోలీసులు శుక్రవారం నాడు కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. నారాయణ విద్యా సంస్థల చైర్మెన్ గా టెక్నికల్ గా వైదొలిగారు. కానీ  ఈ విద్యాసంస్థలపై నారాయణ ఆజమాయిషీ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆధారాలను కూడా సేకరించారు. ఇదే విషయమై కోర్టుకు సమర్పించేందుకు సిద్దమయ్యారు.ఈ విషయమై నారాయణకు చిత్తూరు కోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ  పిటిషన్ పై ఈ నెల 24 కోర్టు విచారణ నిర్వహించనుంది.
 

click me!