పీఆర్సీ వివాదం.. జీతం పెరిగిందో లేదో, ఒకసారి ప్లే స్లిప్ చూడండి: ఏపీ సీఎస్ సమీర్ శర్మ

Siva Kodati |  
Published : Feb 03, 2022, 07:48 PM IST
పీఆర్సీ వివాదం.. జీతం పెరిగిందో లేదో, ఒకసారి ప్లే స్లిప్ చూడండి: ఏపీ సీఎస్ సమీర్ శర్మ

సారాంశం

పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీ పోల్చి చూడాలని... పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందో లేదో తెలుస్తుందని సమీర్ శర్మ వివరించారు. 11వ పీఆర్సీలో 27 శాతం ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఉద్యోగులకు ఐఆర్‌ రూపంలో రూ. 18 వేల కోట్లను ఇచ్చినట్లు సీఎస్‌ పేర్కొన్నారు. 

కరోనా కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ap chief secretary) సమీర్‌ శర్మ (sameer sharma). మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సీఎస్ మీడియాతో మాట్లాడారు. ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని, చర్చిస్తేనే కదా సమస్యలు పరిష్కారమయ్యేదని సమీర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ జీతం తగ్గిందో చెప్పాలని ఆయన ఉద్యోగ సంఘాలను కోరారు. రెండున్నరేళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నామని.. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయాలని సమీర్ శర్మ అన్నారు. 

తెలంగాణలా తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లు మిగిలేదని సీఎస్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలా తాము డీఏ ఇవ్వలేదని, ఐఆర్‌ ఇచ్చామని సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమని, చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. పే స్లిప్‌లో పది రకాల విషయాలు ఉంటాయని, అన్నీ సరి చూసుకోవాలని సీఎస్ అన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీ పోల్చి చూడాలని... పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందో లేదో తెలుస్తుందని సమీర్ శర్మ వివరించారు. 11వ పీఆర్సీలో 27 శాతం ఐఆర్‌ను 30 నెలలపాటు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఉద్యోగులకు ఐఆర్‌ రూపంలో రూ. 18 వేల కోట్లను ఇచ్చినట్లు సీఎస్‌ పేర్కొన్నారు. 

అంతకుముందు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) మాట్లాడుతూ.. ఉద్యోగులను చర్చలకు రోజూ పిలుస్తున్నా రావట్లేదని... వాళ్లకు సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం లేదనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. బలప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలమవుతుందని రామకృష్ణారెడ్డి అన్నారు. వరుస చర్చల సమయంలో పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. సీఎం దృష్టికి ఏదొచ్చినా ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని సజ్జల పేర్కొన్నారు. 

కొవిడ్ వల్ల రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదలేందని, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదని సజ్జల తెలిపారు. మరోవైపు సంక్షేమానికి కూడా నిధులు అవసరమని .. పీఆర్సీ ఏ విధంగా రూపొందించిందో ప్రభుత్వం వివరించిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంచి ప్యాకేజీ ఇచ్చామని... పీఆర్సీ (prc) నుంచి ఎక్కువగా ఆశించటం వల్లే అసంతృప్తి నెలకొందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఠంఛనుగా జీతాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ఉద్యోగులు తమ వారే అనుకుని ప్రభుత్వం ఎంతో చేసిందని... దశాబ్దాలుగా తక్కువ జీతాలున్న అంగన్‌వాడీలకు, ఆశా, మున్సిపల్ వర్కర్లకు గత ప్రభుత్వాల కంటే మంచి జీతాలిచ్చామని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు ఏడేనిమిది విషయాల్లో ఉపకారం చేశామని... ఉద్యోగ భదత్ర గత ప్రభుత్వంలో లేదని, తామే కల్పించామని ఆయన స్పష్టం చేశారు. 27 శాతం మించి చేయాలని ఉన్నా సంక్షేమం వల్ల చేయలేదని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సంక్షేమానికి దోచి పెడుతున్నామనడంలో అర్థం లేదని, ప్రభుత్వం ఎక్కడైనా దుబారా చేస్తుంటే చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. జీతాల్లో ఎవరికీ కోతల్లేవని.. ఉంటే వచ్చి అడగాలని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మేము ఒక్కొక్కరం ఐదు ఓట్లు వేయిస్తామంటే బ్లాక్ మెయిల్ చేయడమే కదా అని సజ్జల అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Palle Panduga: గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.11,085 కోట్ల పనులకు శ్రీకారం
ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu