ఒక్కొక్కరు ఐదు ఓట్లు వేయిస్తారా.. ఇది బ్లాక్‌మెయిల్ కాదా, బలప్రదర్శనలొద్దు : ఉద్యోగులపై సజ్జల ఆగ్రహం

Siva Kodati |  
Published : Feb 03, 2022, 07:00 PM ISTUpdated : Feb 03, 2022, 07:02 PM IST
ఒక్కొక్కరు ఐదు ఓట్లు వేయిస్తారా.. ఇది బ్లాక్‌మెయిల్ కాదా, బలప్రదర్శనలొద్దు : ఉద్యోగులపై సజ్జల ఆగ్రహం

సారాంశం

ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయన్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. (sajjala rama krishna reddy) . జీతాల్లో ఎవరికీ కోతల్లేవని.. ఉంటే వచ్చి అడగాలని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మేము ఒక్కొక్కరం ఐదు ఓట్లు వేయిస్తామంటే బ్లాక్ మెయిల్ చేయడమే కదా అని సజ్జల అన్నారు. 

ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయన్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. (sajjala rama krishna reddy) ఉద్యోగుల చలో విజయవాడ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల గురువారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను చర్చలకు రోజూ పిలుస్తున్నా రావట్లేదని... వాళ్లకు సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం లేదనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. బలప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలమవుతుందని రామకృష్ణారెడ్డి అన్నారు. వరుస చర్చల సమయంలో పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. సీఎం దృష్టికి ఏదొచ్చినా ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని సజ్జల పేర్కొన్నారు. 

కొవిడ్ వల్ల రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదలేందని, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదని సజ్జల తెలిపారు. మరోవైపు సంక్షేమానికి కూడా నిధులు అవసరమని .. పీఆర్సీ ఏ విధంగా రూపొందించిందో ప్రభుత్వం వివరించిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంచి ప్యాకేజీ ఇచ్చామని... పీఆర్సీ (prc) నుంచి ఎక్కువగా ఆశించటం వల్లే అసంతృప్తి నెలకొందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఠంఛనుగా జీతాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. 

ఉద్యోగులు తమ వారే అనుకుని ప్రభుత్వం ఎంతో చేసిందని... దశాబ్దాలుగా తక్కువ జీతాలున్న అంగన్‌వాడీలకు, ఆశా, మున్సిపల్ వర్కర్లకు గత ప్రభుత్వాల కంటే మంచి జీతాలిచ్చామని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఉపాధ్యాయులకు ఏడేనిమిది విషయాల్లో ఉపకారం చేశామని... ఉద్యోగ భదత్ర గత ప్రభుత్వంలో లేదని, తామే కల్పించామని ఆయన స్పష్టం చేశారు. 27 శాతం మించి చేయాలని ఉన్నా సంక్షేమం వల్ల చేయలేదని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సంక్షేమానికి దోచి పెడుతున్నామనడంలో అర్థం లేదని, ప్రభుత్వం ఎక్కడైనా దుబారా చేస్తుంటే చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. జీతాల్లో ఎవరికీ కోతల్లేవని.. ఉంటే వచ్చి అడగాలని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మేము ఒక్కొక్కరం ఐదు ఓట్లు వేయిస్తామంటే బ్లాక్ మెయిల్ చేయడమే కదా అని సజ్జల అన్నారు. 

మరోవైపు PRC జీవోలను వెనక్కి తీసుకొనేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని Employee Union సంఘాల నేతలు తేల్చి చెప్పారు విజయవాడ .BRTS రోడ్డుపై బైఠాయించి ఉద్యోగులు ఆందోళన చేశారు. మారు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకొన్నారు. NGO భవన్ వద్దకు పీఆర్సీ సాధన సమితి నేతలు రాగానే అరెస్ట్ చేయాలని పోలీసులు భారీగా మోహరించారు. అయితే పీఆర్సీ సాధన సమితి నేతలు బైకులపై బీఆర్‌టీఎస్ రోడ్డుకు చేరుకొన్నారు.

ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. . పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడుSuryanarayana మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు.పీఆర్సీ అంశం వారం రోజుల్లో తేల్చేస్తానన్న ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy చాలా వారాల సమయం తీసుకున్నారని విమర్శించారు.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందన్నారు. నలుగురు ఉద్యోగ సంఘాల నేతలమధ్య గాలి కూడా చొరబడకుండా జాగ్రత్తగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగులందరికీ తాము నలుగురం అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఛలో విజయవాడను సక్సెస్ చేసి ఉద్యోగులు తమ సత్తా చాటారని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం