School Holidays: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు పొడిగింపు.. అదనంగా మరో మూడు రోజులు

By Mahesh K  |  First Published Jan 17, 2024, 8:37 PM IST

సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
 


Sankranthi Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులను పొడిగింది. అదనంగా మరో మూడు రోజులను సెలవులుగా పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఈ నెల 22వ తేదీన పున:ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ మేరకు విజ్ఞప్తులు చేశారని, వారి వినతులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తే జనవరి 11వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగకు ఆదరణ మరీ ఎక్కువ. అలాంటి నేపథ్యంలో గతంలో కంటే కూడా సంక్రాంతి సెలవులను కుదించడంపై అభ్యంతరాలు వచ్చాయి.

Latest Videos

సంక్రాంతి సెలవులు తగ్గించడం సమంజసం కాదని ఉపాధ్యాయ సంఘాలు, పేరెంట్స్ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తులు చేశారు. దీంతో సంక్రాంతి సెలవులను జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్ణయించారు. 
Also Read: Gudivada: సీనియర్ ఎన్టీఆర్ సీటుపై టీడీపీ ఫోకస్.. కొడాలి నాని టార్గెట్.. పోటాపోటీగా వర్ధంతి కార్యక్రమాలు

ఇదిపోనూ.. వీటికి అదనంగా మరో మూడు రోజులు సెలవులను ప్రకటించారు. పండుగ అయిపోయాక పిల్లలు వెంటనే స్కూల్స్ రారని మరోసారి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో తాజాగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో మూడు రోజులను సంక్రాంతి సెలవుల కిందే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

click me!