టిడిపి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి...ఏపిలో వద్దు: కాంగ్రెస్ నేత బైరెడ్డి

By Arun Kumar PFirst Published Dec 28, 2018, 8:15 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్ ఓటమికి టిడిపితో పొత్తే కారణమని రాయలసీమ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసివుంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో వాడిన డైలాగులను తెలంగాణ ఓటర్లు నమ్మలేదంటూ బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిడిపితో కాంగ్రెస్ పార్టీ జతకలిస్తే తెలంగాణలో వచ్చిన ఫలితమే వస్తుందన్నారు. అప్పుడు కాంగ్రెస్ నిండా మునగడం ఖాయమని అన్నారు. కాబట్టి 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని...రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని బైరెడ్డి ప్రకటించారు. 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ ఓటమికి టిడిపి పొత్తు కారణం కాదంటున్న సమయంలో బైరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. అలాగే కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలంటే టిడిపి వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. 

click me!