కరోనాపై జగన్ సమీక్ష: మత్స్యకారుల క్షేమ సమాచారంపై సీఎం ఆరా

By Siva KodatiFirst Published Apr 29, 2020, 5:34 PM IST
Highlights

రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 

రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను తిరిగి స్వస్థలాలకు తీసుకు వస్తున్న అంశంపై ఆయన అధికారుల నుంచి వివరాలు కోరారు.

]రవాణా ఖర్చులు, భోజనం, దారి ఖర్చులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు 4,065 మందికి పైగా స్వస్థలాలకు బయల్దేరారని అధికారులు తెలిపారు.

Also Read:టెస్టులు చేస్తుంటే... కేసులు పెరగడం సహజం: టీడీపీపై మోపిదేవి విసుర్లు

దీనిలో భాగంగా మత్య్సకారులు తిరిగి వచ్చిన తర్వాత వారికి రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో నమోదైన కేసులు తీసుకుంటున్న చర్యలపైనా సీఎం ఆరా తీశారు. గడిచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

గుంటూరులో నమోదైన 29 కేసుల్లో 27 కేసులు నర్సరావుపేట నుంచే వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో పాజిటివిటీ శాతం 1.51 శాతం అయితే, దేశవ్యాప్తంగా పాజిటివిటీ కేసులు 3.84 శాతంగా ఉందని తెలిపారు. గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశామని, ఇందులో 70 శాతం వరకు పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశామని అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

Also Read:లాక్‌డౌన్ సడలింపులపై ఏపీ సర్కార్ కొత్త గైడ్‌లైన్స్: మినహయింపులు వీటికే

ఇప్పటి వరకు 88,061 పరీక్షలు చేశామని, ప్రతి మిలియన్‌కు 1,649 పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరులలో ల్యాబ్‌ల గురించి కూడా అధికారులు తెలిపారు. టెలిమెడిసిన్‌పైనా జగన్ ఆరా తీశారు. కాల్ చేసిన వారికి అదేరోజు మందులు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు  సీఎంకు వివరించారు.

ఇప్పటి వరకు 12,247 మందికి కుటుంబ సర్వేలో గుర్తించి వారికి పరీక్షలు చేసినట్లు సీఎంకు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటుచేసుకున్నాయని చెప్పారు. అరటి, టొమాటో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాట్లపై దృష్టిపెట్టాలన్న సీఎం చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలని ఆదేశించారు.
 

click me!