ఏపీ: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 10 లక్షలు.. అర్హులు ఎవరంటే..?

By Siva KodatiFirst Published May 19, 2021, 10:29 PM IST
Highlights

కరోనా వల్ల అనాథలైన చిన్నారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇందుకు సంబంధించి బుధవారం వైద్య ఆరోగ్య శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు

కరోనా వల్ల అనాథలైన చిన్నారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇందుకు సంబంధించి బుధవారం వైద్య ఆరోగ్య శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు.

కోవిడ్ వల్ల తల్లిదండ్రులు ఇద్దరు మరణించిన.. 18 ఏళ్ల లోపు వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులిద్దరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబలకు చెందిన వారై ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై ప్రభుత్వం రూ.10 లక్షల డిపాజిట్‌ చేయనుందని ఆయన తెలిపారు. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా లబ్దిదారులకు అందించేలా కార్యాచరణ రూపొం‍దించినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఏకే సింఘాల్‌ వెల్లడించిన  సంగతి తెలిసిందే. 

కాగా,  కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు ఏపీ సర్కార్ రూ. 10 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు  కరోనాపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

Also Read:పశ్చిమ గోదావరిలో మరణ మృదంగం.. ఒక్కరోజులో 17 మంది మృతి, ఏపీలో కొత్తగా 23,160 కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులో కనీసం 20 వేల కేసులు నమోదౌతున్నాయి. దీంతో తల్లిదండ్రులను కోల్పొయిన అనాథలైన పిల్లలను ఆదుకోవాలని ఈ సమావేశంలో సీఎం జగన్  నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

తల్లిదండ్రులు చనిపోయి అనాధలైన పిల్లలను ఆదుకొనేందుకు ఆ పిల్లల పేరున రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా   వచ్చే వడ్డీతో పిల్లలు జీవించేలా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించారు. కర్ఫ్యూను పొడిగింపు కారణంగా  కరోనా కేసులు సంఖ్య తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడ మరింత వేగవంతం చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. 
 

click me!