గుంటూరు: వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ

Siva Kodati |  
Published : May 19, 2021, 09:40 PM IST
గుంటూరు: వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ

సారాంశం

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో జరిగిన ఈ గొడవలో ఇరువర్గాల వారు పరస్పరం వాగ్వాదానికి దిగారు. అనంతరం తోపులాట చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ సచివాలయంలో జరిగిన ఈ గొడవలో ఇరువర్గాల వారు పరస్పరం వాగ్వాదానికి దిగారు. అనంతరం తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన తర్వాత రెండు వర్గాల వారు  నరసరావుపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వైసీపీ వర్గీయులే గొడవకు కారణమని జనసేన తరఫున ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని సర్పంచి గౌషియా బేగం వాపోయారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!