క్రిస్మస్ పండగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీసస్ సందేశాలను గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి: రేపు(శనివారం) క్రిస్మస్ పండగను (christmas 2021) పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ఒకరోజు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సీఎం జగన్ ప్రకటన విడుదల చేసారు.
''దైవ కుమారుడు జీసస్ ((jesus) మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నాం. క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు... అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన'' అని జగన్ పేర్కొన్నారు.
''దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం... ఇవీ జీసస్ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలు'' అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
read more త్వరలో రాయలసీమ రూపు రేఖలు మారిపోతాయి.. Cm Ys Jagan
ఇక ప్రస్తుతం సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. నిన్న(గురువారం) గన్నవరం నుండి కడపకు చేరుకున్న సీఎం వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట నేరుగా ప్రొద్దుటూరు (prodduturu)కు వెళ్లి పలు అబివృద్ది పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం బద్వేల్ (badvel) నియోజకవర్గంలో సెంచురీ ఫ్లైవుడ్ కంపనీకి శంకుస్థాపన చేసారు. అక్కడి నుండి కడప సమీపంలోని కొప్పర్తిలో మెగా ఇండ్రస్ట్రియల్ హబ్ కు శంకుస్థాపన చేసి నేరుగా ఇడుపులపాయ (idupulapaya)కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బసచేసారు.
ఇవాళ(శుక్రవారం) ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి అర్పించారు. వైయస్సార్ ఘాట్ కు చేరుకుని తండ్రి సమాధి వద్ద పుష్ఫగుచ్చం నమస్కరించుకున్నారు. జగన్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసిపి నాయకులు వున్నారు. క్రిస్మస్ పండగ, జగన్ రాక సందర్భంగా వైఎస్సార్ ఘాట్ ను పూలతో అలంకరించారు.
Asianet Special Video AP ticket price row: రాజకీయాల్లో జగన్ సీతయ్య, కారణం ఇదీ...
ఇక శనివారం క్రిస్మస్ (christmas) సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి పులివెందుల (pulivendula) సీఎస్ఐ చర్చిలో సీఎం జగన్ పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం కడప నుండి గన్నవరంకు విమానంలో చేరుకుని అక్కడి నుండి క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
అయితే క్రిస్మస్ పండగ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా కుటుంబసమేతంగా పులివెందుల వెళ్లనున్నట్లు సమాచారం. కొడుకు జగన్,కోడలు భారతి, కూతురు షర్మిల, అల్లుడు అనిల్ తో పాటు వారి పిల్లలతో కలిసి వైఎస్ విజయమ్మ క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారని సమాచారం. చాలారోజుల తర్వాత జగన్; షర్మిల కలుస్తుండటంతో ఈ క్రిస్మస్ వేడుక గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.