ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సీనట్నంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన చీఫ్ వపన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబులపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
నర్సీపట్నం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ , ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. అనకాపల్లి జిల్లాలోని నర్నీపట్నంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు,ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీ,ఈ భార్యతో కాకపోతే ఆ భార్యతో అన్నట్టుగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల తీరు ఉందని ఆయన విమర్శించారు.
దత్త తండ్రిని నెత్తిన పెట్టుకుని దత్తపుత్రుడు ఊరేగుతున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు పవన్ కళ్యాణ్ డైలాగులు వల్లె వేస్తున్నాడని ఆయన విమర్శించారు.
రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడన్నారు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ప్రజలు ఆయనను ఓడించారని జగన్ గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కాల్‌షీట్లు ఇస్తాడన్నారు. ఎక్కడ షూటింగ్ అంటే అక్కడకు వస్తాడని చెప్పారు. బాబు స్క్రిప్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ నటిస్తాడని జగన్ చెప్పారు.
రాష్ట్రంలో ఏ పని చేసినా తానే చేశానని తన వల్లే జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటాడని జగన్ ఎద్దేవా చేశారు. బాడ్మింటన్ లో పీవీ సింధు విజయం సాధించినా తానే ఆమెకు బాడ్మింటన్ నేర్పించానని చెప్పుకుంటాడని చంద్రబాబుపై ఆయన సెటైర్లు వేశారు. ఈ 73 ఏళ్ల ముసలాయణ్ని చూస్తే మోసం, వెన్నుపోటే గుర్తుకు వస్తుందని సీఎం జగన్ చెప్పారు.చంద్రబాబు పాపాల్లో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఉందన్నారు.