కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలి: గుంటూరులో ఏపీ జ్యుడిషీయల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ

By narsimha lodeFirst Published Dec 30, 2022, 10:32 AM IST
Highlights

కేసుల పరిష్కారంలో  జాప్యాన్ని నివారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  చంద్రచూడ్  కోరారు.  న్యాయవ్యవస్థలో  టెక్నాలజీ  అంతర్భాగంగా  మారిందన్నారు.  ఇవాళ  గుంటూరులో  పలు కార్యక్రమాల్లో ఆయన  పాల్గొన్నారు. 
 

గుంటూరు:  కేసుల పరిష్కారంలో  జాప్యాన్ని  నివారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ న్యాయమూర్తులను కోరారు. గుంటూరులో  శుక్రవారంనాడు  ఏపీ హైకోర్టు వార్షిక నివేదికను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  చంద్రచూడ్  విడుదల చేశారు. అంతకుముందు  ఏపీ జ్యుడిషీయల్  అకాడమీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  సాంకెతికతను అందిపుచ్చుకొనేందుకు  డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా సీజేఐ చెప్పారు.నూతన సాంకేతికతకు అనుగుణంగా  మార్పులు  చేసుకోవడం చాలా ముఖమ్యమని సీజేఐ తెలిపారు.  మౌళిక సదుపాయాలు కల్పించడం  కష్టమైన ప్రక్రియగా ఆయన  పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో సాంకేతికత అంతర్భాగమైందని  సీజేఐ చెప్పారు కేసుల సత్వర  పరిష్కారానికి  టెక్నాలజీ  చాలా ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  తెలిపారు.  న్యాయవాదులు  నల్లకోటు  ధరించి  తిరుగుతుండడాన్ని చూస్తుంటామన్నారు. తెల్లచొక్కాపై  నల్ల కోటు ధరించడాన్ని గమనించే ఉంటామన్నారు. తెలుపు,నలుపు  ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలకు  గుర్తుగా  పరిగణిస్తామని సీజేఐ చెప్పారు. 

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సీజేఐ సూచించారు.బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు, న్యాయాన్ని నిలబెట్టుందుకని  ఆయన చెప్పారు.కేసుల సంఖ్య కంటే  తీర్పుల నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. 

న్యాయ  వ్యవస్థలలో  సాంకేతిక పరిజ్ఞానం వాడకం వేగంగా పెరిగిందని ఆయన  చెప్పారు.  నిత్య విద్యార్ధులుగా ఉంటూ  నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని  సీజేఐ  అభిప్రాయపడ్డారు.వివాదాల పరిష్కారమే కాదు,  న్యాయాన్ని  నిలబెట్టే విధంగా  ఉండాలని ఆయన  సూచించారు.  కేసుల పరిష్కారంలో  జాప్యాన్ని  నివారించాలని ఆయన  సీజేఐ సూచించారు.న్యాయ వ్యవస్థను పరిరక్షించడంలో  అందరి సహకారం  అవసరమన్నారు.

click me!