జలవివాదం: ప్రధాని మోడీకి జగన్ మరో లేఖ

By narsimha lodeFirst Published Jul 7, 2021, 4:56 PM IST
Highlights


హైదరాబాద్:  ప్రధాని నరేంద్ర మోడీకి  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు లేఖ రాశారు. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని ఆ లేఖలో కోరారు.
 

అమరావతి:  ప్రధాని నరేంద్ర మోడీకి  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారం నాడు లేఖ రాశారు. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని ఆ లేఖలో కోరారు.ఇటీవలనే  రెండు తెలుగు రాష్ట్రాల్లో  చోటు చేసుకొన్న నీటి వివాదాలను పరిష్కరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇవాళ కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని మోడీకి  రాసిన లేఖలో కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  

also read:కృష్ణా జలాల్లో వాటాపై రాజీలేదు, పార్లమెంట్‌లో గళమెత్తుతాం:కేసీఆర్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తే జైలుకు పంపుతామని ఎన్జీటీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను హెచ్చరించింది. ఎన్జీటీ ఆదేశాలను పాటించకుండా  పనులు నిర్వహిస్తున్నారని ఏపీపై  తెలంగాణ మరోసారి  ఎన్జీటీని ఆశ్రయించింది. 

 

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ బుధవారం నాడు లేఖ రాశారు. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని ఆ లేఖలో కోరారు.ఇటీవలనే రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న నీటి వివాదాలను పరిష్కరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇవాళ కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని మోడీకి రాసిన లేఖలో కోరారు. pic.twitter.com/ziGEPKl7yS

— Asianetnews Telugu (@AsianetNewsTL)

శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ  నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని  ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.  ఈ విషయమై రెండు దఫాలు లేఖలు రాసింది. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ గా లేఖలు రాసింది. ఏపీ వాటా వినియోగానికి కేంద్ర జల్ శక్తి శాఖ జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. తమ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్ర జల్ శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాల్సిందిగా కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రతా కల్పించాలన్నారు.ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని  లేఖలో కోరారు

click me!