
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంతగా నిఘా పెట్టినా అక్రమ మద్యం సరిహద్దులు దాటుతూనే వుంది. తాజాగా ఆదివారం గుంటూరు జిల్లా (guntur district) దాచేపల్లి మండలం (dachepalli) పొందుగుల చెక్ వద్ద (pondugula check post) పాల వ్యాన్‌లో తరలిస్తున్న 637 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు తెలంగాణ నుండి ఏపీలోకి వస్తున్న పాలలారీని ఆపి తనిఖీ చేయగా లారీలో తరలిస్తున్న 637 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ బాటిళ్ల విలువ లక్ష రూపాయలు వరకు ఉంటుందని వారు తెలిపారు. అక్రమంగా మద్యం తరలించడం నేరమని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.