ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఈ నెల 19వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
అమరావతి: ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ఈ నెల 19వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
రాష్ట్రంలో ఇటీవల కాలంలో దేవాలయాలపై దాడులు,. దేవత విగ్రహాలు ధ్వంసమయ్యాయి.ఈ తరుణంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత నెలకొంది.
మంగళవారం నాడు మధ్యాహ్నం సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుండి జగన్ ఢిల్లీకి వెళ్తారు. రేపు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు.
రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై బీజేపీ నేతలు ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్రంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం నాడు ప్రకటించారు.
రాష్ట్రంలో దేవాలయాలపై చోటు చేసుకొన్న ఘటనలతో పాటు ఇతర విషయాలను కూడ కేంద్రానికి నివేదిస్తామని సోము వీర్రాజు తెలిపారు. మరో వైపు రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కేంద్రానికి లేఖ రాసినట్టుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు.