రామతీర్థం ఆలయానికి భారీ నిధులు... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Jan 18, 2021, 3:41 PM IST
Highlights

రామతీర్థంలోని రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది, పునః నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు వెల్లడించారు.

విజ‌య‌వాడ‌: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది రామతీర్థం ఘటన. విజయసగరం జిల్లాలోని ఈ ప్రాచీన ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఏపీ రాజకీయాలనే ఓ కుదుపు కుదుపింది. ముఖ్యంగా వైసిపి ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. దీంతో ఈ ఆలయానికి భారీగా నిధులు కేటాయించి దేవాలయ అభివృద్దికి పూనుకుంది జగన్ సర్కార్. రామతీర్థంలోని రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది,పునః నిర్మాణానికి మూడు కోట్లు రూపాయులు కేటాయించినట్లు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు వెల్లడించారు.

సొమ‌వారం విజయవాడ బ్రాహ్మాణ‌వీధిలోని క్యాంపు కార్యాల‌యంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు అధ్య‌క్ష‌త‌న‌ సెక్ర‌ట‌రీ గిరిజా శంక‌ర్‌, ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు, ఎస్.ఈ ఎ శ్రీ‌నివాస్‌,రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ భ్ర‌మ‌రాంబ‌, డిఈలతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 

వీడియో

అనంతరం మంత్రి మాట్లాడుతూ... పండితులు స‌ల‌హాలు, వైఖాసన ఆగమ సంప్రదాయం ప్ర‌కారం ఆల‌య అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు వివ‌రించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థం పునః నిర్మాణ ప‌నులు ఏడాదిలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను అదేశించారు..700 అడుగు ఎత్తులో ఉన్న ఆల‌య నిర్మాణం పూర్తి రాతి క‌ట్ట‌డాల‌తో జ‌రుతుంద‌న్నారు.

కోదండ రాముడి విగ్ర‌హాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వారు త‌యారు చేసి అంద‌జేయున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా  రామ‌తీర్థం మెట్లు మార్గం స‌రిచేయ‌డం పాటుగా కొత్త‌ మెట్లు నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. దేవాల‌య ప‌రిస‌రాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంక‌ర‌ణ చేయ‌డం,  శా‌శ్వత నీటి వ‌స‌తి, కోనేటిని శుబ్ర‌ప‌ర్చ‌టం, కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్నాటు చేయ‌టం, ప్రాక‌ర నిర్మాణం, హోమ‌శాల‌, నివేద‌నశాల నిర్మాణం కూడా పూర్తి చేయ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. 

click me!