కంటతడి పెట్టుకొన్న ఎమ్మెల్యే రోజా: ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఏడ్చిన నగరి ఎమ్మెల్యే

Published : Jan 18, 2021, 02:23 PM IST
కంటతడి పెట్టుకొన్న ఎమ్మెల్యే రోజా: ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఏడ్చిన నగరి ఎమ్మెల్యే

సారాంశం

 ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు, చురకలతో నిప్పులు చెరిగే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకొన్నారు. ప్రివిలేజ్ సమావేశంలో రోజా  కంటతడి పెట్టుకోవడం చర్చకు దారితీస్తోంది.

అమరావతి: ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు, చురకలతో నిప్పులు చెరిగే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకొన్నారు. ప్రివిలేజ్ సమావేశంలో రోజా  కంటతడి పెట్టుకోవడం చర్చకు దారితీస్తోంది.

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు కన్నీళ్లు పెట్టుకొన్నారు.  నగరి నియోజకవర్గంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల విషయంలో నిర్వహించిన సమావేశానికి అధికారులు తనకు సమాచారం కూడ ఇవ్వడం లేదని రోజా ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై రోజా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు  చేశారు. 

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ శాసనసభ ప్రివిలేజ్ కిటీ సమావేశంలో ఎమ్మెల్యే రోజా  పాల్గొన్నారు. ఈ విషయమై  అధికారుల తీరును ఎమ్మెల్యే రోజా ఏకరువు పెట్టారు. ఈ సమస్యలను వివరిస్తూ ఎమ్మెల్యే రోజా కంటతడి పెట్టారు.

నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు విషయమై ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్  కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు.

ఎమ్మెల్యే రోజాకు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ సూచించింది. తనకు తెలియకుండానే అధికారులు సమావేశాలు నిర్వహించడంపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?