ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పార్టీకి చెందిన ఎంపీలతో బుధవారం నుండి భేటీ కానున్నారు. ప్రతి రోజూ ఎనిమిది మంది ఎంపీలతో జగన్ సమావేశం కానున్నారు. ఆయా ఎంపీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై జగన్ చర్చించనున్నారు.త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నందున ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh CM YS Jagan) సీఎం వైఎస్ జగన్ పార్టీకి చెందిన ఎంపీలతో భేటీ కానున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ(ycp) అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.ద ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. దీంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
undefined
జగన్ కొలువులోని మంత్రులను పనితీరు ఆధారంగా కొనసాగించనున్నారు. పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మంత్రి పదవుల కోసం పలువురు నేతలు జగన్ ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ తరుణంలో పార్టీకి చెందిన ఎంపీలతో జగన్ ఇవాళ్టి నుండి భేటీ కానున్నారు. ప్రతి రోజూ ఎనిమిది మంది ఎంపీలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఒక్కొక్క ఎంపీతో జగన్ విడివిడిగా భేటీ కానున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితితో పాటు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల పనితీరుపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.ప్రతి రోజూ ఎనిమిది మంది ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ నాయకత్వం వేటు వేసింది. దీంతో రఘురామకృష్ణంరాజు మినహా ఇతర ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు.