పార్టీ పటిష్టతపై ఫోకస్... ఎల్లుండి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ

Siva Kodati |  
Published : Jul 20, 2022, 09:58 PM IST
పార్టీ పటిష్టతపై ఫోకస్...  ఎల్లుండి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ

సారాంశం

ఎల్లుండి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేయడంతో పాటు పలు సూచనలు చేయనున్నారు సీఎం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు ఏపీ సీఎం, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్ (ys jagan) . దీనిలో భాగంగా ఎల్లుండి రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ కానున్నారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. 

ఇకపోతే.. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టును CM Jagan వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్ పీకారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తిరగని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. తాను చేయాల్సిందంతా చేస్తున్నానని.. ఎమ్మెల్యేలు కష్టపడాలని ఏపీ సీఎం స్పష్టం చేశారు. తనతో పాటుగా ఎమ్మెల్యేలు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు.ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడపకు తిరిగి  ప్రభుత్వం చేసిన పథకాలను వివరించాలన్నారు. మీరు నా మీద అలిగినా బాధ పడినా పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. 

Also REad:నేను చేయాల్సిందంతా చేస్తున్నా,అలా అయితే టికెట్ కట్: గడప గడపకు వర్క్ షాప్ లో జగన్

ఇంకా సమయం మించి పోలేదని ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు.  ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని .. వెళ్లకపోతే తనకు నష్టం లేదన్నారు. ప్రజల్లో తిరగకుండా ఉన్నా,  మొక్కుబడిగా తిరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే  ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు 87 శాతం ప్రజలకు  అందినట్టుగా వివరించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో  సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఒప్పుకొంటున్న సందర్భంలో గతంలో కంటే మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరం ఉందని ఆయన తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, Kuppam  మున్సిపాలిటీలో విజయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. మనపై లక్షలాది మంది ప్రజలు ఆధారపడి ఉన్నారన్నారు. వీరందరికి న్యాయం జరగాలంటే మనం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పారు.

ప్రతి నెలలో 6 లేదా  ఏడు సచివాలయాల్లో ఎమ్మెల్యేలు సందర్శించాలని జగన్ సూచించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారం కోసం రూ. 20 లక్షలు కేటాయించామన్నారు. సచివాలయం విజిట్ పూర్తైన వెంటనే కలెక్టర్లు నిధులు మంజూరు చేస్తారని సీఎం జగన్ వివరించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని 10 రోజుల్లోపు పూర్తి చేసిన ఎమ్మెల్యేలు ఐదుగురుగా  సీఎం జగన్ చెప్పారు. 45 రోజులు దాటి కార్యక్రమం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ తేల్చి చెప్పారు. 30 నుండి 45 రోజులు చేసింది 15 మంది ఎమ్మెల్యేనని సీఎం ప్రోగ్రెస్ రిపోర్టును వివరించారు. మాజీ మంత్రి ఆళ్లనాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు గడప గడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఒక్క రోజూ కూడా పర్యటించలేదని సీఎం జగన్ వివరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?