కరోనా తీవ్రత: రేపు జగన్ హైలెవల్ భేటీ... నైట్‌కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం..?

By Siva KodatiFirst Published Apr 18, 2021, 9:20 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. వైరస్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది. అలాగే పదో తరగతి పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షల వాయిదాపైన నిర్ణయం వెలువడే ఆస్కారం వుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. వైరస్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.

అలాగే పదో తరగతి పరీక్షల రద్దు, ఇంటర్ పరీక్షల వాయిదాపైన నిర్ణయం వెలువడే ఆస్కారం వుంది. ఇప్పుడు స్కూళ్లకు సెలవులు ప్రకటించే పరిస్ధితి కనిపిస్తోంది. కరోనా కట్టడికిగాను రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో సర్కార్ వున్నట్లుగా తెలుస్తోంది.

దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలు విధించే అవకాశం వుంది. బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం వున్నట్లు సమాచారం. వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వాలంటీర్లతో ఇంటింటి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో సీఎం వున్నట్లు తెలుస్తోంది. 

Also Read:కరోనా విశ్వరూపం: ఆంధ్రప్రదేశ్ లో రాత్రి కర్ఫ్యూ?

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి పద్మారావు మృత్యువాత పడ్డారు. ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. దాదాపు 60 మంది సచివాలయ ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 

సచివాలయంలో ప్రతి శుక్రవారం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా శుక్రవారం నాడు 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 60 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. 

కరోనాతో మృతి చెందిన పద్మారావు భార్య కూడా సచివాలయంలోనే పనిచేస్తున్నారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఐఎఎస్ అధికారులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శాఖాధిపతులు (హెచ్ఓడీలు) ఎవరూ సచివాలయానికి రావడం లేదు. హెచ్ఓడీలు విజయవాడ, గుంటూరుల్లోని తమ కార్యాలయాల నుంచే పనిచేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా తమకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది.

click me!