పోలీస్ శాఖపై ఆరోపణలు: ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్

By Siva Kodati  |  First Published Apr 18, 2021, 9:07 PM IST

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది. వివేకా హత్య విషయంలో డీజీపీ, పోలీసు అధికారులపై ఏబీవీ లేఖ రాయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో దీనిపై 30 రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం ఏబీవీని ఆదేశించింది.


సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది. వివేకా హత్య విషయంలో డీజీపీ, పోలీసు అధికారులపై ఏబీవీ లేఖ రాయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఈ నేపథ్యంలో దీనిపై 30 రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం ఏబీవీని ఆదేశించింది. అఖిలభారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఏబీ వెంకటేశ్వరరావు ప్రవర్తన వుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏబీ ప్రవర్తన వుందని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం స్పష్టీకరించింది. 

Latest Videos

అంతకుముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు దర్యాప్తుపై మాజీ ఏపీ ప్రభుత్వ ఇంటలిజెన్స్ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలను డీఐజీ పాల్ రాజు తీవ్రంగా ఖండించారు. జగన్ కుటుంబసభ్యులను, బంధువులను అరెస్ట్ చేయాలని  ఆ సమయంలో ఏబీవీ ఒత్తిడి తెచ్చారని  ఆయన ఆరోపించారు. 

ఆదివారం నాడు విజయవాడలో  సిట్  దర్యాప్తును పర్యవేక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకాలం వైఎస వివేకానందరెడ్డి  హత్య కేసు దర్యాప్తుపై మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారని వారు ప్రశ్నించారు.

Also Read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐకి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

తన వద్ద కీలక సమాచారం ఉంటే ఇంతకాలం ఎందుకు  ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలను వాస్తవం కాదన్నారు.  ఏబీ వెంకటేశ్వరరావు వద్ద  ఉన్న సమాచారం సీల్డ్ కవర్లో  ఇవ్వవచ్చని ఆయన కోరారు.

సిట్ దర్యాప్తుపై  ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు సరికాదన్నారు.హత్య కేసులో నిజాలు వెలికితీయకుండా సీఎం కుటుంబంపై బురదజల్లారని వారు ఆరోపించారు.ఈ హత్య కేసు దర్యాప్తును 15 రోజుల పాటు ఏబీ వెంకటేశ్వరరావు ప్రత్యక్షంగా పర్యవేక్షించారని  వారు గుర్తు చేశారు.ఈ సమాచారాన్ని సీబీఐకి ఇవ్వకుండా ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

సమాచారం వేరు, ఆధారాలు వేరు, దర్యాప్తు వేరని వారు తెలిపారు.  వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత 15 రోజుల పాటు  ప్రతి రోజూ  అప్పటి సీఎంకి, డీజీపీకి ఇచ్చేవారని పోలీసులు గుర్తు చేశారు.  ఇంటలిజెన్స్ వింగ్ నుండి బదిలీ అయ్యే సమయం వరకు  ఈ కేసును  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసును  ఏబీ వెంకటేశ్వరరావు  ప్రతి రోజూ  సమీక్షించేవారని  పోలీసు ఉన్నతాధికారులు గుర్తు చేశారు.

click me!