కేసీఆర్ అడుగు ముందుకేశారు, కక్ష ఎందుకు: చంద్రబాబుపై జగన్ ధ్వజం

By narsimha lodeFirst Published Jul 11, 2019, 10:30 AM IST
Highlights

చంద్రబాబునాయుడు  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో  చంద్రబాబు గాడిదలు కాశారా అని ఆయన ప్రశ్నించారు.


అమరావతి:  చంద్రబాబునాయుడు  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే సమయంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో  చంద్రబాబు గాడిదలు కాశారా అని ఆయన ప్రశ్నించారు.

గురువారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరు కావడాన్ని టీడీపీ తప్పుబట్టింది. దీనిపై జగన్  టీడీపీపై విరుచుకుపడ్డారు.

 గోదావరి నదీ జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ద్వారా  కృష్ణా నది ఆయకట్టును స్థిరీకరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారని  ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుండే  కేసీఆర్ రాష్ట్రానికి అవసరమైన నీటిని  అందించేందుకు ముందుకు రావడాన్ని ఆయన గుర్తు చేశారు. 

గోదావరి  నది జలాలను నాగార్జునసాగర్ ఆయకట్టుకు మళ్లించడం ద్వారా  ఏపీ రాష్ట్రంలోని  రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం , పశ్చిమగోదావరి జిల్లాల్లోని కృష్ణా ఆయకట్టును స్థిరీకరించుకొనే అవకాశం ఉందన్నారు.

 ఎగువ ప్రాంతాల్లోని రాష్ట్రాలు ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా  దిగువ రాష్ట్రాలకు నీళ్లు  వచ్చే అవకాశం తక్కువగా ఉందన్నారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టి నీటిని నిల్వ చేసుకొంటే దిగువ రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవడం, కేసులు పెట్టడం మినహా ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం  ఉదాసీనంగా నీటిని ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య స్నేహాపూర్వక వాతావరణం ఉన్నందుకు సంతోషించాలని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.చంద్రబాబునాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఆల్మట్టి ఎత్తును 519 మీటర్లను పెంచారని జగన్ విమర్శించారు. ప్రస్తుతం 519 మీటర్ల ఎత్తును 524 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు ఆ రాష్ట్రం ప్రయత్నిస్తోందన్నారు.

కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా  దిగువకు నీటి విడుదల తగ్గిపోతోందని ఆయన గుర్తు చేశారు. గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టును స్థీరికరించడం కోసం ఉపయోగించడాన్ని కూడ రాజకీయం  చేయడం దౌర్భాగ్యమన్నారు.


 

click me!