ఎమ్మెల్యే రోజాకి కీలక పదవి

By telugu teamFirst Published Jul 11, 2019, 10:12 AM IST
Highlights

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ గా రోజాని నియమించారు. 

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ గా రోజాని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వైసీపీ అధికారంలోకి వస్తే... రోజాకి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే... నిజంగానే వైసీపీ అధికారంలోకి వచ్చినా.. రోజాకి మాత్రం మంత్రి పదవి కేటాయించాలేదు. ఈ విషయంలో రోజా బాగా హర్ట్ అయ్యారని కూడా వార్తలు వెలువడ్డాయి.  అయితే... కేవలం కుల సమీకరణాల కారణంగానే మంత్రి పదవి ఇవ్వలేని జగన్ ఆమెకు నచ్చచెప్పారు. కీలకపదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే.. తాజాగా రోజాని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. 

అదే సమయంలో.. తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) స్పెషల్‌ ఆఫీసర్‌గా ఏవీ ధర్మారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్ కు చెందిన ధర్మారెడ్డి టీటీడీ స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు ఆ తర్వాత కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ధర్మారెడ్డి బుధవారం వరకు కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు
 

click me!