నా వెంట్రుక కూడా పీకలేరు: విపక్షాలపై నంద్యాల సభలో జగన్ నిప్పులు

By narsimha lode  |  First Published Apr 8, 2022, 1:40 PM IST

ప్రజల దీవెనలు, దేవుడి దయ ఉన్నంత కాలం విపక్షాలు తన వెంట్రుక కూడా పీకలేరని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.  నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసిన తర్వాత ఆయన ప్రసంగించారు.


 నంద్యాల:దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఉన్నంత కాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరని ఏపీ సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Jagananna Vasathi Deevena  కార్యక్రమం కింద  రెండో విడత 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లు ఏపీ సీఎం YS Jagan  శుక్రవారం నాడు జమ చేశారు. ఈ సందర్భంగా Nandyalలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

Latest Videos

తమ ప్రభుత్వం విద్యార్ధులకు చిక్కి అందిస్తుందన్నారు. అయితే ఈ చిక్కి విద్యార్ధుల చేతికి అంటకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ఈ చిక్కికి  కవర్ చుట్టి అందిస్తున్నామన్నారు.ఈ చిక్కీపై జగన్ ఫోటో ఉందని చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల కోసం చంద్రబాబు సర్కార్ కంటే గతంలో కంటే ఎంత ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నామో మాత్రం చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో  విపక్షాలకు కడుపుమంట, అసూయ కలుగుతుందన్నారు. అసూయకు మందే లేదన్నారు.  అసూయ ఎక్కువైతే బీపీ, షుగర్ తో పాటు గుండెపోటు వస్దుందని జగన్  చెప్పారు. అది అలానే కొనసాగితే ఏదో ఒక రోజు టికెట్ తీసుకుంటారని జగన్ శాపనార్ధాలు పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కేోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడితే వాటికి సహకరించకపోగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.  రోజుకో కట్టు కథను ప్రచారం చేస్తున్నారన్నారు. పార్లమెంట్ వేదికగా కూడా కట్టుకథలను ప్రచారం చేసి రాష్ట్ర పరువును తీశారని జగన్  టీడీపీపై మండిపడ్డారు.  బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విపక్షాలున్నాయన్నారు. కానీ రాష్ట్రం పరువును పార్లమెంట్ లో తీసే ప్రయత్నాలు  ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు చేయలేదన్నారు. ఏపీ రాష్ట్రంలో దౌర్భాగ్యపు విపక్షం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు సర్కార్ ఎగ్గొట్టిన పీజు రీ ఎంబర్స్ మెంట్  బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందని సీఎం జగన్ గుర్తు చేశారు. 
 

click me!