మార్షల్స్‌ను చంద్రబాబు బాస్టర్డ్ అంటారా: జగన్

By narsimha lode  |  First Published Dec 13, 2019, 10:27 AM IST

ఏపీ అసెంబ్లీలో విపక్షనేత చంద్రబాబునాయుడు మార్షల్స్ ను బాస్టర్డ్ అంటారా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 


అమరావతి: ఏపీ అసెంబ్లీలో విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గురువారం నాడు మార్షల్స్ పట్ల దారుణంగా వ్యవహరించాడని ఏపీ  సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. మార్షల్స్‌‌ను చంద్రబాబునాయుడు బాస్టర్డ్ అంటూ తిడుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. 

Alsor read:కావాలని వచ్చి డ్రామాలాడుతున్నారు.. చంద్రబాబుపై కొడాలి నాని

Latest Videos

శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో  గురువారం నాడు అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలను శాసనసభలో ప్రదర్శించారు. 

ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబునాయుడు తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కానీ వారిని చంద్రబాబు వెంట ఉన్న కమెండోలను అసెంబ్లీలోకి అనుమతించాలా అని జగన్ ప్రసంగించారు.  సభ్యులు కానీ వారిని గేటు నుండి ఎందుకు అనుమతిస్తారని జగన్ ప్రశ్నించారు.

ఇతర వ్యక్తులను  సభలోకి రాకుండా మార్షల్స్ అడ్డుకొనే ప్రయత్నం చేశారని జగన్ చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇలా తిడుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడుతో పాటు టీడీపీ  సభ్యులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. 

మార్షల్స్ తమ డ్యూటీ తాము చేశారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.  కానీ, మార్షల్స్‌ను తమ విధులను నిర్వహించకుండా టీడీపీ సభ్యులు అడ్డుకొన్నారని ఆయన గుర్తు చేశారు.  టీడీపీ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరించారని జగన్ విమర్శలు చేశారు.

మార్షల్స్‌పై చేతులు వేసి నెట్టేసి దూషించడం సరైందేనా అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.

నిన్న భద్రతా సిబ్బందిపై చంద్రబాబుగారు దారుణంగా ప్రవర్తించారన్నారు. రోజూ తాను రావాల్సిన గేటులో కాకుండా చంద్రబాబు మరో గేటులో వచ్చారని ఆయన తెలిపారు. 
గేటు నంబర్‌ –2 ద్వారా ఆయన రావాల్సి ఉంటుందన్నారు.

గేటు నంబర్‌–2 ద్వారా కాకుండా కాలినడకన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వాళ్లు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు ఇలా అందరితోపాటు ఒక ఊరేగింపుగా గేట్లలోనుంచి వచ్చారని జగన్ చెప్పారు. 

ఆ గేట్లలో నుంచి ఊరేగింపుగా వస్తున్నప్పుడు ఎవరు సభ్యుడు, ఎవరు సభ్యుడు కాదు అని చూసుకుని లోపలికి పంపించేందుకు కొన్ని భద్రతా నిబంధనలు పెట్టారని చెప్పారు.ఈ విషయంలో మార్షల్స్‌ వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారని జగన్ తెలిపారు. 

మొత్తం దృశ్యాలన్నీ చూస్తే.. ఎవరు, ఎవరిమీద దౌర్జన్యం చేశారో అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు  నోట్లో నుంచి వచ్చిన మాట ‘‘బాస్టర్డ్‌’’ అంటూ దూషించాడన్నారు. ఒక ఉద్యోగిని పట్టుకుని చంద్రబాబు బాస్టర్డ్‌ అన్నందుకు ఆయన సిగ్గుపడాల్సి ఉందన్నారు. 

ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుని బాస్టర్డ్‌ అని అనడం అంటే ఎంత దారుణమని జగన్ ప్రశ్నించారు.లోకేష్‌ అనే వ్యక్తి నాలుగు అడుగులు ముందుకు వేసి ఏకంగా అధికారులను గొంతుపట్టుకున్నారని జగన్ గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారని జగన్ సభలో ప్రస్తావించారు. ఎవరు ఎవరిమీద దౌర్జన్యం చేస్తున్నారో అర్ధం అవుతోందోనని జగన్ చెప్పారు.
 

click me!