మా పథకాలతో ఫ్యూజులు పోయాయి: విపక్షాలపై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

By narsimha lode  |  First Published Aug 11, 2023, 1:25 PM IST

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో  విపక్షాలకు దిక్కు తోచడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు.


అమలాపురం:మహిళల ముఖంలో  చిరునవ్వు చూసి ప్రతిపక్షాలకు  నిద్రపట్టడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. అమలాపురంలో  వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కింద నాలుగో విడత నిధులను  సీఎం జగన్ శుక్రవారం నాడు విడుదల చేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  సీఎం జగన్ ప్రసంగించారు.

చంద్రబాబు  అధికారంలో ఉన్నప్పుడు  సామాజిక న్యాయం ఉందా అని ఆయన ప్రశ్నించారు.తమ ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలను  చూసి  ప్రతిపక్షాలకు ప్యూజులు దిక్కు తోచడం లేదన్నారు. ప్రతిపక్షాల మైండ్ లో ఫ్యూజులు కూడ ఎగిరిపోయాయని  సీఎం జగన్ ఎద్దేవా చేశారు. మీ బిడ్డల భవిష్యత్తు గురించి చంద్రబాబు  ఏనాడైనా ఆలోచించారా అని  ఆయన ప్రశ్నించారు. పేదలకు  ఇంగ్లీష్ మీడియం  వద్దన్న చరిత్ర చంద్రబాబుదన్నారు. కానీ వాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియా స్కూళ్లకు వెళ్లాలనే బాబు నైజమన్నారు. పేదలకు  ఇళ్లు కట్టించాలన్న ఆలోచన 75 ఏళ్ల  ముసలాయన చేశారా అని చంద్రబాబుపై  సెటైర్లు వేశారు.పేదలకు  ఇంటి స్థలం ఇస్తామంటే  అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుకే స్వంతమన్నారు.

Latest Videos

undefined

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పథకం పేరైనా గుర్తుకు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి  చంద్రబాబు సీఎం అయితే  మంచి జరుగుతుందా ఆలోచించాలని  ఆయన  ప్రజలను కోరారు.   చంద్రబాబు సీఎం అయితే మనకు మంచి జరగదన్నారు.

also read:ఎందుకు ఈ రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి: పుంగనూరు ఘర్షణలపై బాబుపై జగన్ ఫైర్

చంద్రబాబు దళితులను చీల్చి నరకం చూపించాడన్నారు. చంద్రబాబు కోసం  దత్తపుత్రుడు  పరుగులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ పై  విమర్శలు చేశారు.తనకు  గిట్టని వారి అంతు చూస్తానని చంద్రబాబు వార్నింగ్ లు ఇస్తున్నాడని  సీఎం జగన్  గుర్తు  చేశారు.ఇందు కోసమే చంద్రబాబుకు  అధికారం కావాలని కోరుకుంటున్నాడన్నారు.ఎస్టీలకు , మైనార్టీలకు  నరకం చూపిన చరిత్ర చంద్రబాబుదని ఆయన  చెప్పారు.బీసీల తోకలు కత్తిరిస్తానని బాబు ఆనాడు బెదిరించాడన్నారు.  ఎస్టీలకు  బాబు ఒక్క ఎకరం కూడ రాలేదన్నారు. ఇలాంటి వ్యక్తిని  సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని దత్తపుత్రుడు ఎందుకు  ప్రయత్నిస్తున్నాడని  ఆయన పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

click me!