దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ఉద్యమం: చంద్రబాబుపై జగన్ సెటైర్లు

Published : Dec 17, 2020, 01:44 PM IST
దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ఉద్యమం: చంద్రబాబుపై జగన్ సెటైర్లు

సారాంశం

రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించి ఆ చుట్టూపక్కల ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు భూములను కొనుగోలు చేశారని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.


రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించి ఆ చుట్టూపక్కల ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు భూములను కొనుగోలు చేశారని  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.గురువారం నాడు విజయవాడలోని నిర్వహించిన బీసీ సంక్రాంతి సభలో ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు.

ఓ దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో  తాను స్వంతంగా బాగుపడేందుకు  అమరావతిలో భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. తాను తన బినామీలతో చంద్రబాబు అమరావతి చుట్టుపక్కల భూములను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు.

also read:కేబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత: బీసీ సంక్రాంతి సభలో జగన్

అమరావతిలో తాము కొనుగోలు చేసిన భూముల ధరలు ఎక్కడ తగ్గిపోతాయనే ఉద్దేశ్యంతోనే ఓ ఉద్యమం మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.ఓ చెడిపోయిన బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే తెలుస్తోందన్నారు.

మంచి బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయం  56 మంది ఛైర్మెన్ల నియామకం గురించి ఆయన ప్రస్తావించారు.ప్రజలను చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. 

బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం  చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రచారం లభించకుండా ఉండేందుకు గాను మరో పక్క ఉద్యమం పేరుతో చంద్రబాబునాయుడు గగ్గోలు పెడుతున్నాడన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్