నాకు ఓటు వేయకపోయినా పథకాలు వర్తింపజేస్తాం: జగన్ కామెంట్స్

By Siva KodatiFirst Published Jun 4, 2020, 2:36 PM IST
Highlights

తనకు ఓటు వేయని వారికీ పథకాలు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి  తేల్చిచెప్పారు. 2018 మే నెలలో ఏలూరులో పాదయాత్ర సందర్భంగా వాహనమిత్రకు సంబంధించిన మాట ఇచ్చానని.. ప్రతి జిల్లాలో తనకు ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారని జగన్ గుర్తుచేసుకున్నారు

నకు ఓటు వేయని వారికీ పథకాలు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి  తేల్చిచెప్పారు. 2018 మే నెలలో ఏలూరులో పాదయాత్ర సందర్భంగా వాహనమిత్రకు సంబంధించిన మాట ఇచ్చానని.. ప్రతి జిల్లాలో తనకు ఆటో డ్రైవర్లు తమ సమస్యలు చెప్పుకున్నారని జగన్ గుర్తుచేసుకున్నారు.

ఎక్కడా అవినీతి లేకుండా వైఎస్ఆర్ వాహనమిత్రను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గురువారం ఆయన అధికారులపై సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 10న నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు సాయం చేస్తామన్నారు.

Also Read:రాజధాని గ్రామాల్లో కరోనా కలకలం... వాలంటీర్ కు పాజిటివ్

మిగిలిన అర్హులుంటే స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. లాక్‌డౌన్ కారణంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు రోడ్డుపడ్డారని.. 17న నేతన్న హస్తం, 24న కాపు నేస్తం పథకాలు ప్రారభిస్తున్నట్లు  జగన్ స్పష్టం చేశారు.

అలాగే ఈ నెల 29న ఎంఎస్ఎంఈలకు రెండో విడత లబ్ధి చేకూరుస్తామని.. పేదలకు న్యాయం చేస్తేనే రాష్ట్రం, దేశానికి చాలా మంచిదన్న సీఎం..  ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారిలో కూడా అన్ని వర్గాల వారు ఉన్నారని తెలిపారు.

Also Read:ఏపీలో కరోనా విజృంభణ: 3377కు చేరుకున్న పాజిటివ్ కేసులు, 71 మరణాలు

పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని జగన్ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. 

click me!