ఏపి ప్రజలకు హెచ్చరిక...రాష్ట్రంలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు

By Arun Kumar PFirst Published Jun 4, 2020, 2:05 PM IST
Highlights

గురువారం కోస్తాంధ్ర, యానాంలలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

విశాఖపట్నం: గురువారం కోస్తాంధ్ర, యానాంలలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. 

బుధవారం నర్సాపురంలో అత్యధికంగా అయిదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంటుందనీ, ఈనెల ఆరున(శుక్రవారం) మళ్లీ తెలంగాణ కోస్తాంధ్రలలో వర్షాలు కురుస్తాయనీ వాతావరణ శాఖ అంచనా వేసింది.

మహారాష్ట్రలో తీరందాటిన నిసర్గ తుపాను వాయుగుండంగా బలహీన పడి మధ్యప్రదేశ్ మీదకు ప్రయాణిస్తోందని... దీని ప్రభావంతో ఈరోజంతా విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

read more  ప్రాణాలను బలితీసుకున్న అకాల వర్షాలు... పిడుగుపాటుతో నలుగురు మృతి

మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో అలీబాగ్ వద్ద నిసర్గ తుఫాన్ నిసర్గ తుఫాన్ తీరాన్ని దాటింది. ఈ తుఫాన్ ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్రలపై ప్రభావాన్ని చూపగా ఇప్పుడు మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించింది.  న్

ఈ తుఫాను ప్రభావంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతాలు జలమయంగా మారాయి. ఈ తుఫాను ప్రభావం తగ్గేవరకు ప్రజలు ఎవరూ కూడ బయటకు రావొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.  

click me!