అకాల వర్షాలు.. ప్రతి రైతుకూ పరిహారం అందాలి, బాధ్యత మీదే : అధికారులతో సీఎం జగన్

Siva Kodati |  
Published : May 04, 2023, 02:14 PM IST
అకాల వర్షాలు.. ప్రతి రైతుకూ పరిహారం అందాలి, బాధ్యత మీదే : అధికారులతో సీఎం జగన్

సారాంశం

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తడిసిన , రంగుమారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టం వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికి పరిహారం అందలేదన్న మాట రాకూడదన్నారు. రైతులకు జరిగిన పంట నష్టంతో పాటు ఇతర వివరాలను గ్రామ సచివాలయాల నుంచి సేకరించాలని జగన్ ఆదేశించారు. 

తడిసిన , రంగుమారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని.. ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టోపోయిన రైతుల వివరాలను గ్రామ సచివాలయాల్లో వుంచి తనిఖీ చేయాలని జగన్ సూచించారు. దీని వల్ల ఎవరికైనా సాయం అందకపోతే వారి వివరాలను నమోదు చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. రబీ సీజన్‌కు కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని.. రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. రైతుల సమస్యలు, ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఇకపోతే.. రాష్ట్రంలో అకాల వర్షాలు, సహాయక చర్యలు, ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం కూడా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద వున్న ఈ తరహా ధాన్యాన్ని తీసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కోసి వున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 

Also Read: రైతాంగానికి శుభవార్త.. తడిసిన ధాన్యం కొనుగోలుకు సీఎం జగన్ ఓకే, అధికారులకు కీలక ఆదేశాలు

కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్దకాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఎన్యుమరేషన్‌  ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చుల కింద ప్రతి కలెక్టర్‌కూ రూ.1 కోటి రూపాయలను ఇప్పటికే కేటాయించామని, అధికారులు వాటిని వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. 

రాష్ట్రంలో అకాల వర్షాలు, సహాయక చర్యలు, ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. రైతుల వద్ద వున్న ఈ తరహా ధాన్యాన్ని తీసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కోసి వున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 

కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్దకాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఎన్యుమరేషన్‌  ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చుల కింద ప్రతి కలెక్టర్‌కూ రూ.1 కోటి రూపాయలను ఇప్పటికే కేటాయించామని, అధికారులు వాటిని వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu