నిరుద్యోగులకు శుభవార్త: సీఎం జగన్ ఆదేశాలు... ఆ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

By Arun Kumar PFirst Published Dec 9, 2021, 4:42 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లోో నీటి పారుదల ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ, భద్రతపై ఉన్నతాధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

అమరావతి: రాష్ట్రంలోని వివిధ నీటి ప్రాజెక్టులు (water projects), రిజర్వాయర్ల (reservoirs) భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను  సీఎం వైఎస్ జగన్‌ (ys jaganmohan reddy) ఆదేశించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారిగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలని... అవసరమైన సిబ్బందిని నియమించాలని (recruitment) అధికారులకు సీఎం ఆదేశించారు.  

గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు జగన్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం(andhra pradesh)లో నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిస్థితిని పట్టించుకోలేదని సీఎం పేర్కొన్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ముప్పు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులోభాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని సీఎం జగన్ సూచించారు. 

గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జవనరులశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ, రెవిన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జలవనరులశాఖ ఇంజినీర్‌ఇన్‌ ఛీఫ్‌లతో కమిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఐఐటీ, జేఎన్‌టీయూ నిపుణుల కమిటీకి జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఛైర్మన్‌గా ఉన్నారని, తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారని వివరించారు. 

read more  జీవో నెంబర్ 59 వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అసలు ఆ జీవోలో ఏముందంటే..

సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ ప్రాజెక్టులు, నిర్వహణలపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోందన్నారు. తాజా వచ్చిన వరదలను, కుంభవృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు చేస్తుందన్నారు. ఆటోమేషన్‌ రియల్‌టైం డేటాకూ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించే వ్యవస్థపై కూడా చీఫ్‌ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టిసారించిదని ముఖ్యమంత్రి జగన్ కు అధికారులు వివరించారు. 

అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, అలాగే వాటర్‌ రెగ్యులేషన్‌కోసం కూడా సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్దమయ్యాయని అధికారులు తెలియజేశారు. వీరి నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

read more  ఏపీకి వ‌ర‌ద‌సాయం అందించండి- అమిత్‌షాను కోరిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ఇకపై ప్రాజెక్టుులు, రిజర్వాయర్ల నుండి పెద్దమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేసిన పక్షంలో ఆస్తినష్టం, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టుప్రాంతాలను గుర్తించే పనినికూడా అత్యున్నత స్థాయి కమిటీ చేస్తోందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. ఇటీవల రెండు రాష్ట్రాలు తమ సరిహద్దుల వద్ద భారీగా పోలీసులను మోహరించారంటే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.  

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని ఏపీ చేపట్టింది. ఈ రెండు ప్రాజెక్టులను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఏడారిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం వల్ల కూడ తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ వాదిస్తోంది.  

తెలంగాణ ప్రభుత్వం కూడా పరిమితికి మించి నదీజలాలను వాడుకుంటోందని ఏపీ ఆరోపిస్తోంది. శ్రీశైలంలో జలవిద్యుత్ కోసం భారీగా నీటిని వృధా చేస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఇలా ఇరు తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న వేళ జగన్ ప్రాజెక్టుల భద్రత, నిర్వహణపై తీసుకున్న నిర్ణయాలు రాజకీయ చర్చకు దారితీసాయి. 
 

 

click me!