ఏపీకి వచ్చే కంపెనీలకు ఇన్సెంటివ్‌లు.. ఐటీకి కేంద్రంగా విశాఖ: జగన్

By Siva KodatiFirst Published Jun 23, 2021, 5:06 PM IST
Highlights

రాష్ట్రంలో ఐటీ పాలసీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు ఇస్తామని తెలిపారు

రాష్ట్రంలో ఐటీ పాలసీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు ఇస్తామని తెలిపారు. ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీలు నిర్మిస్తామని సీఎం వెల్లడించారు. అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ఐటీ పాలసీ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హై ఎండ్ స్కిల్స్ నేర్పించే కంపెనీలు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు.

Also Read:గుంటూరు గ్యాంగ్ రేప్... హోంమంత్రి, డిజిపిలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు (వీడియో)

భవిష్యత్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని జగన్ జోస్యం చెప్పారు. ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్సిటీని విశాఖలో తీసుకురావాలని సీఎం సూచించారు. అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు డెస్టినేషన్‌గా యూనివర్సిటీ మారాలని జగన్ ఆకాంక్షించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. డిసెంబర్ కల్లా 4 వేల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తామన్నారు. 

click me!