ఆ జిల్లాల్లో మరిన్ని కరోనా పరీక్షలు చేయండి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

By Siva Kodati  |  First Published Apr 21, 2020, 3:05 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు


రాష్ట్రంలో కరోనా వైరస్, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ జిల్లాల్లో మరిన్ని పరీక్షలు, మరిన్ని చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

మాస్క్‌ల పంపిణీ ఊపందుకుందన్న అధికారులు, వీటిని రెడ్, ఆరెంజ్ జోన్లకు ముందుగా పంపిణీ చేపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు బాగా జరుగుతున్నాయని.. విశాఖపట్నంలో టెస్టులు బాగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి వివరించారు.

Latest Videos

undefined

Also Read:కరోనా నియంత్రణ చర్యలపై అఖిలపక్షం ఏర్పాటుకు బాబు డిమాండ్

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కేసులు నమోదుకాలేదని చెప్పారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కోవిడ్‌ –19 పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ఇదే సమయంలో గవర్నమెంట్‌ ఆస్పత్రిలో ఉన్న వారిని మిగతా ఆస్పత్రులకు మార్చామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్లాస్మా థెరఫీని ప్రారంభించడానికి అనుమతి కోరామని, పీపీఈలను, మాస్క్‌లనుకూడా అవసరాలకు అనుగుణంగా ఉంచుతున్నామని అధికారులు చెప్పారు.

సమగ్ర సర్వేలద్వారా గుర్తించిన 32వేలమందిలో ఇప్పటికే 2వేలకుపైగా పరీక్షలు చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. క్వారంటైన్ సెంటర్లలో ఇప్పటి వరకు 7,100 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

Also Read:వయసుమళ్లిన సీఎంలంతా అలా...ఈ యువ ముఖ్యమంత్రి ఇలా: అచ్చెన్నాయుడు

దీనిపై స్పందించిన సీఎం జగన్... పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. దూకుడుగా కొనుగోళ్లు జరపాలి, రైతులకు అండగా నిలబడాలని అధికారులను ఆదేశించారు.

కాగా లాక్‌డౌన్‌ సందర్భంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీతో మాట్లాడానని చెప్పారు. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని, వెంటనే అధికారులకు ఆదేశాలిస్తానని తనతో చెప్పారని జగన్ వెల్లడించారు. 

click me!