వ్యాన్ ను చూసుకొని మురిసిపోతున్నారు: పవన్ కళ్యాణ్ పై జగన్ సెటైర్లు

Published : Jun 16, 2023, 12:23 PM IST
వ్యాన్ ను చూసుకొని  మురిసిపోతున్నారు: పవన్ కళ్యాణ్ పై  జగన్ సెటైర్లు

సారాంశం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై  ఏపీ సీఎం వైఎస్ జగన్  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  తన వ్యాన్ ను చూసుకొని మురిసిపోతున్నారని  సెటైర్లు వేశారు.   


గుడివాడ: తన వ్యాన్ ను చూసుకొని  పవన్ కళ్యాణ్  మురిసిపోతున్నారని  ఏపీ సీఎం వైఎస్ జగన్  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. 

గుడివాడలో  టిడ్కో ఇళ్లను  ఏపీ సీఎం వైఎస్ జగన్  శుక్రవాంరనాడు  ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఏర్పాటు  చేసిన  సభలో  సీఎం ప్రసంగించారు. వారాహి యాత్రలో వైఎస్ఆర్‌సీపీ పై చేసిన విమర్శలకు ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. 

 175  స్థానాల్లో  పార్టీ అభ్యర్ధులను  పెట్టలేని వారు  తమకు ప్రత్యర్ధులా అని  ఏపీ సీఎం వైఎస్ జగన్  జనసేనాని  పవన్ కళ్యాణ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.   రాజకీయాల్లోకి  వచ్చి  15 ఏళ్లు దాటినా  కూడ  రాష్ట్రంలో అన్ని స్థానాల్లో  పోటీకి అభ్యర్ధులు జనసేనకు లేరని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.చంద్రబాబు కోసం  పుట్టానని  పవన్ కళ్యాణ్  చెప్పుకుంటున్నారన్నారు.  తన జీవితమే  చంద్రబాబు కోసమే త్యాగమని పవన్ కళ్యాణ్  మాట్లాడడాన్ని  సీఎం జగన్ తప్పుబట్టారు.  
తాను  కూడ ఎమ్మెల్యే అవుతానని, దీన్ని ఎవరూ  ఆపలేరని  ప్యాకేజీ స్టార్ అంటున్నారని  పవన్ కళ్యాణ్ పై  సీఎం జగన్  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వారాహి యాత్రను  పవన్ కళ్యాణ్ చేపట్టారు.ఈ నెల  14 నుండి  పవన్ కళ్యాణ్ ఈ యాత్రను  ప్రారంభించారు. ఈ యాత్ర సందర్భంగా వైసీపీపై , సీఎం జగన్ పై  పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు.   ఈ విమర్శలకు  ఏపీ సీఎం జగన్  ఇవాళ కౌంటర్  ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Satya Kumar Yadav Highlights Importance of Blood Donation | BloodCamp | Asianet News Telugu
Vishnu Kumar Raju: వైజాగ్ నుండి భోగాపురం డ్రాపింగ్ 4000..అందుకే 6వందే భారత్లు | Asianet News Telugu