ప్రతి ఒక్కరూ సత్యనాదెళ్ల కావాలి: జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేసిన జగన్

Published : Apr 26, 2023, 01:33 PM IST
 ప్రతి ఒక్కరూ  సత్యనాదెళ్ల కావాలి:  జగనన్న వసతి దీవెన  నిధులు విడుదల  చేసిన జగన్

సారాంశం

గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ తీరుకు , ప్రస్తుతం  తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను  పరిశీలించాలని  ఏపీ సీఎం  జగన్ ప్రజలు  కోరారు.  జగనన్న వసతి దీవెన కింద నిధులను  ఏపీ సీఎం జగన్  ఇవాళ విడుదల  చేశారు.    

అనంతపురం:రాష్ట్రంలో  ప్రతి ఒక్క విద్యార్ధి సత్య నాదెళ్ల కావాలనేది  తమ  ప్రభుత్వ ఉద్దేశ్యమని  ఏపీ సీఎంజగన్ చెప్పారు

అనంతపురం జిల్లాలోని నార్పలలో   జగనన్న వసతి  దీవెన  పథకం కింద  నిధులను  ఏపీ సీఎం వైఎస్ జగన్  బుధవారంనాడు   విడుదల  చేశారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో  ఆయన  ప్రసంగించారు.

జగనన్న వసతి దీవెన పథకం కింద  ఉన్నత విద్య చదివే విద్యార్ధుల  తల్లుల ఖాతాల్లో  రూ. 913  కోట్లను  ఏపీ సీఎం వైఎస్ జగన్  జమ చేశారు.  ఈ పథకం కింద ఇప్పటివరకు  రూ.4,275.76 కోట్లు విడుదల చేసింది  

పేదలకు  పెద్ద చదువులు  అందించాలని  ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్టుగా  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.  తమ ప్రభుత్వం  తీసుకువచ్చిన విధానాల కారణంగా  ప్రభుత్వ స్కూళ్లు  ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయన్నారు.  గత ప్రభుత్వానికి  ఇప్పటి ప్రభుత్వానికి  ఉన్న తేడాను  గమనించాలని  ఆయన  ప్రజలను కోరారు.  

పేద కూలీలు, కార్మికులుగా  మిగలాలనే పెత్తందారి  మనస్తతత్వం  గత ప్రభుత్వానిదని  వైఎస్ జగన్  చెప్పారు.  పేదలకు  పెద్ద చదువులు  అందించాలనేది  తమ ప్రభుత్వ లక్ష్యమని జగన్  వివరించారు. 

గవర్నమెంట్  స్కూళ్లలో డిజిటల్ బోధన అందిస్తున్నామని  సీఎం జగన్ తెలిపారు.  చదువు  ఒక కుటుంబ చరిత్రనే కాదు  ఆ కుటుంబానికి చెందిన సామాజిక వర్గాన్ని మారుస్తుందని  సీఎం జగన్  చెప్పారు.  పేదరికం సంకెళ్లు  తెంచుకోవడానికి చదువే అస్త్రమని  సీఎం  పేర్కొన్నారు.. చదువుల కోసం  ఎవరూ  కూడా అప్పులు   చేయకూడదని  తమ ప్రభుత్వ అభిమతంగా  సీఎం చెప్పారు.  

ఎనిమిదో తరగతి  నుండే విద్యార్ధులకు ట్యాబ్ లను  అందిస్తున్నామన్నారు.  ఆరో తరగతి  నుండి డిజిటల్ బోధన  అందిస్తున్నామన్నారు.  నాణ్యమైన  చదవులు  కోసం విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చామని  సీఎం జగన్  చెప్పారు.

 ప్రభుత్వం  అందిస్తున్న ప్రోత్సాహంతో  ఉన్నత విద్య చదువుకునే వారి సంఖ్య పెరిగిందని  సీఎం  జగన్ వివరించారు.  2018-19 లో  87 వేల మంది  ఇంజనీరింగ్ చదివేవారన్నారు.  కానీ 2022-23  వచ్చేనాటికి  1.20 లక్షల మంది  విద్యార్ధులు  ఇంజనీరింగ్  చదువుతున్నారని  సీఎం జగన్  తెలిపారు.  నాడు - నేడు తో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోతున్నాయని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. 

also read:మాంసం తినే పులి మారుతుందా?: ముసలి పులితో బాబును పోలుస్తూ జగన్ సెటైర్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కంపెనీలతో  ఒప్పందాలు  చేసుకుందన్నారు.  మైక్రోసాఫ్ట్  విద్యార్ధుల నైపుణ్యాన్ని పెంచేందుకు  ఆన్ లైన్ కోర్సులను  కూడా తీసుకువచ్చినట్టుగా సీఎం జగన్  వివరించారు. పీజు రీ ఎంబర్స్ మెంట్ ను  పూర్తిగా విద్యార్ధులకు అందిస్తున్నామని  సీఎం జగన్  చెప్పారు. గత ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను  కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందని ఆయన గుర్తు  చేశారు.   

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్