వైఎస్ వివేకా హత్య: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు తీర్పు

By narsimha lodeFirst Published Apr 26, 2023, 12:07 PM IST
Highlights

 ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ రద్దు పిటిషన్ పై   ఇవాళ వాదనలు ముగిశాయి.  రేపు తీర్పును వెల్డించనుంది  తెలంగాణ హైకోర్టు. 

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో   ఏ1 నిందితుడిగా  ఉన్న ఎర్రగంగిరెడ్డి  బెయిల్ పై  బుధవారంనాడు  వాదనలు  ముగిశాయి. ఈ పిటిషన్ పై  రేపు  తీర్పు ఇవ్వనుంది  తెలంగాణ హైకోర్టు.  గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని  సీబీఐ అధికారులు  పిటిషన్ ను  దాఖలు  చేసిన విషయం తెలిసిందే.

2022  నవంబర్ 14న   ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.   ఆ తర్వాత  ఈ పిటిషన్ పై విచారణను  తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు.  

Latest Videos

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  ఏ1 నిందితుడిగా  ఉన్న ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ గా  బెయిల్ మంజూరైందని సీబీఐ గుర్తు  చేస్తుంది.  ఆ సమయంలో  ఈ కేసును విచారించిన సిట్  అధికారులు సకాలంలో చార్జీషీట్ దాఖలు  చేయకపోవడంతో  ఎర్ర గంగిరెడ్డికి  బెయిల్ మంజూరైందని  సీబీఐ తరపు న్యాయవాదులు  వాదనలు విన్పించారు.  ఈ కేసులో  గంగిరెడ్డి కీలక నిందితుడని సీబీఐ చెబుతుంది.  గంగిరెడ్డి   బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే  అవకాశం ఉందని సీబీఐ ఆరోపిస్తుంది.  ఎర్ర గంగిరెడ్డి   బెయిల్ ను రద్దు చేయాలని  సీబీఐ వాదిస్తుంది. అయితే  ఈ వాదనలను  ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాదులు తోసిపుచ్చుతున్నారు.  గంగిరెడ్డి  బెయిల్ పై  ఉన్నా కూడా  విచారణకు  సహకిస్తున్న విషయాన్ని  గుర్తు చేస్తున్నారు. 

also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్: విచారణ రేపటికి వాయిదా

ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ రద్దు  పిటిషన్ పై   విచారణను నిన్న, ఇవాళ   తెలంగాణ హైకోర్టులో  సాగాయి.  అందరి వాదనలను  తెలంగాణ హైకోర్టు విన్నది.  ఈ పిటిషన్ పై  తీర్పును రేపు వెల్లడించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు తెలిపింది. 
 

click me!