విశాఖ శారదా పీఠం వార్షిక ఉత్సవాలు: రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్

By narsimha lode  |  First Published Feb 9, 2022, 1:06 PM IST

విశాఖ పట్టణంలోని శారదా పీఠం వార్షికోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు పాల్గొన్నారు. ప్రతి ఏటా మాఘమాసంలో శారదా పీఠం వార్షికోత్సవాలను నిర్వహిస్తారు.


విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు Sharada vidya peethవార్షికోత్సవంలో పాల్గొన్నారు.  ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం YS Jagan ఇవాళ ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ Vishakapatnam పట్టణానికి చేరుకొన్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మెన్ YV Subba Reddy కూడా ఉన్నారు.

విశాఖపట్టణం Airport నుండి సీఎం జగన్ రోడ్డు మార్గం ద్వారా మూషివాడలోని  శారదా పీఠానికి చేరుకొన్నారు. రాజశ్యామల దేవి యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు.ప్రతి ఏటా మాఘమాసం పంచమి నుండి దశమి వరకు శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి.దేశ రక్షణ కోసం శఆరద పీఠంలో  రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగం పూర్తైన తర్వాత సీఎం జగన్  వేద విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలను అందిస్తారు. ఆనంతరం ఆయన విశాఖపట్టణం నుండి తాడేపల్లికి చేరుకొంటారు. శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనడం  ఇది వరుసగా మూడో ఏడాది.

Latest Videos

click me!