సీఎం జగన్ కొత్తటీమ్ రెడీ: నెక్స్ట్ కలెక్టర్, ఎస్పీల బదిలీలు

By Nagaraju penumalaFirst Published May 31, 2019, 6:35 PM IST
Highlights

సీఎంవోలు పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను దాదాపుగా మార్చివేసి తన టీంను నియమించుకున్నారు. తాజాగా ప్రోటోకాల్ డైరెక్టర్ అశోక్ బాబును సైతం బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం.  అశోక్ బాబు డిప్యూటేషన్‌ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన టీంను తయారు చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ తన టీం ను నియమించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంవోలో కీలక మార్పులు చేశారు. 

సీఎంవోలు పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను దాదాపుగా మార్చివేసి తన టీంను నియమించుకున్నారు. తాజాగా ప్రోటోకాల్ డైరెక్టర్ అశోక్ బాబును సైతం బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం.  అశోక్ బాబు డిప్యూటేషన్‌ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్‌ ను ప్రోటోకాల్ డైరెక్టర్ గా నియమిస్తూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. అశోక్ బాబును మాతృసంస్థ అయిన రక్షణ శాఖకు పంపుతూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇకపోతే కె.నాగేశ్వర్ రెడ్డిని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పీఏగా నియమించారు. అంతేకాదు జగన్ కు ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శులను సైతం నియమించింది ప్రభుత్వం. అటు శనివారం సాయంత్రానికి అన్నిశాఖల్లో ప్రక్షాళన  పూర్తి చేసి కొత్త టీమ్ ను సీఎం జగన్ నియమించుకోను్నారని తెలుస్తోంది. అలాగే జిల్లాలు, ఎస్పీల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

click me!