అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలు పొడిగించింది.
అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాల పాటు పొడిగించింది ఏపీ హైకోర్టు. మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపై ఏపీ సీఐడీ 2020 ఫిబ్రవరి 27న ఎస్స్, ఎస్టీ కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇదే విషయమై నల్లూరు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న మరో కేసును కూడ సీఐడీ నమోదు చేసింది. 2022లో మాజీ మంత్రి నారాయణ పేరును నిందితుల జాబితాలో చేర్చింది. దీంతో ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లకు ఊరట కల్పిస్తూ మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలను పొడిగించింది.అయితే ఈ విషయమై ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కొంత సమయం కావాలని ఏపీ హైకోర్టును కోరారు. దీంతో ఈ నెల 16వ తేదీకి ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.