ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ:ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. గురువారంనాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ చర్చించారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లను మంజూరు చేయాలని సీఎం జగన్ కేంద్ర మంత్రిని కోరారు. రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని సీఎం కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పునకు తమను శిక్షించడం సరైంది కాదని జగన్ కేంద్ర ఆర్ధిక మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.7,058 కోట్లను ఇప్పించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని సీఎం కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల ను విడుదల చేయాలని సీఎం కోరారు
undefined
.పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని సీఎం కోరారు. పోలవరం డయాఫ్రంవాల్ ప్రాంతంలో మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం కోరారు.
బుధవారంనాడు రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన 13 అంశాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు జగన్ వినతి పత్రం సమర్పించారు. ఇవాళ ఉదయం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశమయ్యారు.
ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై సీఎం జగన్ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ , పోలవరం నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో జగన్ చర్చించారని సమాచారం.
also read:ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. కాసేపట్లో అమిత్ షాతో భేటీ.. !
ఈ నెల 16న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అదే రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన అంశాలపై మోడీ, అమిత్ షాతో జగన్ చర్చించారు. ఈ మేరకు వినతి పత్రాలు సమర్పించారు. 15 రోజుల వ్యవధిలోనే మరోసారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
పోలవరం ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం, విభజన అంశాలను పరిష్కరించాలని కేంద్రానికి జగన్ వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. 15 రోజుల్లో జగన్ రెండవసారి హస్తన టూర్ పై పలు రకాల ఊహగానాలు వెలువడుతున్నాయి.